సారాంశం

Weight Loss Tips: చింతపండులో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లెవనాయిడ్స్ Metabolism ను వేగవంతం చేస్తాయి. దీంతో ఆకలి చాలావరకు తగ్గుతుంది. కాబట్టి చింతపండుతో మీరు ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

Weight Loss Tips: ప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్య సర్వసాధారణంగా మారింది. చిన్నపిల్లలు నుంచి మొదలు పెడితే.. మధ్య వయస్కులు సైతం ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి త్వరగా బయటపడేందుకు ఎన్నో మార్గాలను వెతుక్కుంటున్నారు. ప్రత్యేక డైట్ ను ఫాలో అవ్వడం, వ్యాయామం చేయడం వంటి చిట్కాలను ఫాలో అవుతూ.. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. 

అలాంటి వారికి చింతపండు ఎంతో మేలు చేస్తుంది. అవును చింతపండుతో వెయిట్ లాస్ ప్రక్రియ మరింత సులభం అవుతుంది. రెగ్యులర్ గా ఈ చింతపండును తీసుకుంటే మీరు చాలా తొందరగా బరువు తగ్గుతారని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. పుల్లగా ఉండే ఈ చింతపండులో ఎన్నో ఔషద గుణాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.  

చింతపండులో మంచి కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఇ, కె, సి, బి1, బి2, బి5, బి3, బి6 తో పాటుగా సోడియం, ఐరన్, ఎనర్జీ, జింక్, ఫాస్పరస్, కాల్షియం  వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. 

చింతపండులో ఉండే Hydroxy citric acid మనలో Fat production ను తగ్గిస్తుందట. అంతేకాదు ఇందులో ఉండే HCA ఫ్యాట్ నిల్వలకు కారణమయ్యే ఎంజైమ్స్ కు అడ్డుగా నిలుస్తుంది. అలాగే ఆకలిని తగ్గించడానికి Hydroxycitric acid serotonin neurotransmitter levels ఎంతో సహాయపడగాయి. వ్యాయామం చేస్తున్నప్పుడు కొవ్వు తొందరగా కరిగేందుకు కూడా ఇది ఎంతో సహాయపడుతుంది.  

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చింతపండు కొన్ని ఉదరసంబంధ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ చింతపండు రసంతో పిత్త రుగ్మతలకు నివారణగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. 

చింతపండును రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. చింతపండులో పాలీఫెనాల్స్, ఫ్లెవనాయిడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు దీనితో మెటబాలిజం కూడా పెరుగుతుంది. తద్వారా ఆకలి చాలా వరకు తగ్గుతుంది. దీంతో మీరు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. 

మామూలుగా ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్లే బరువు పెరుగుతారు. అలాంటప్పుడు వీళ్లు తమ రోజు వారి ఆహారంలో చింతపండును చేర్చుకోవాలి. దీనివల్ల ఆకలి ఎక్కువ కాదు.  తద్వార మీరు చాలా ఫాస్ట్ గా వెయిట్ తగ్గుతారు. 

చింతపండులో Antioxidants, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. Fungal infections ను కూడా తగ్గిస్తాయి. అలర్జీ సమస్య ఉన్న వారు ప్రతి రోజూ చింతపండును తీసుకుంటే ఈ సమస్య నుంచి తొందరగా బయటపతారని నిపుణులు చెబుతున్నారుు. 

దగ్గు, ఉబ్బసం, జలుబు, ఇన్ఫెక్షన్ వంటి సమస్య నివారణకు కూడా చింతపండు ఎంతో సహాపడుతుంది. బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ చింతపండు గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇన్ని ప్రయోజనాలున్న చింతపండును మోతాదుకు మించి తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ చింతపండుకు గ్యాస్ సమస్య ఉన్నవారు దూరంగా ఉండాలి. చింతపండును తీసుకునే ముందు వైద్యులను సంప్రదించి వారి సలహాలను తీసుకోవడం ఉత్తమం.