బతుకమ్మ పువ్వులతో ఇన్ని సమస్యలు తగ్గిపోతాయా?
Bathukamma 2023: రంగురంగుల పువ్వులతో అందంగా బతుకమ్మను తీర్చిదిద్దుతుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం. అందుకే ఆడవాళ్లు ఎక్కడున్నా పువ్వునైనా తీసుకొచ్చి అందంగా బతుకమ్మను తయారుచేస్తారు. ఈ పవ్వులు ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ పువ్వులు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి తెలుసా?

Bathukamma 2023: పువ్వుల అందం మన మనస్సును అదో లోకంలోకి తీసుకెళుతుంది. ఇక వీటి నుంచి వచ్చే పరిమళాలు మనకున్న ఒత్తిడినంతా పోగొట్టి మనల్ని మన మనసుకు సంతోషాన్ని కలిగిస్తాయి. అందుకేనేమో ఆడవాళ్లకు పూలంటే మహాఇష్టం. ఇక బతుకమ్మను అందంగా తయారుచేయడానికి తీరొక్క పువ్వులను పోగేస్తారు. తీరొక్క పువ్వును బతుకమ్మను అందంగా తయారుచేసి.. ఆడవాళ్లు అందంగా ముస్తాబయ్యి బతుకమ్మలు ఆడుతారు. ఈ పండుగ ఆడవాళ్లకు తెచ్చి సంబురం అంతా ఇంతా కాదు. అయితే బతుకమ్మను స్థానికంగా దొరికే పువ్వులతోనే తయారుచేస్తారు.ఇది అందరికీ తెలుసు. తెలియని విషయం ఏంటంటే.. బతుకమ్మను తయారుచేయడానికి వాడే ప్రతి పువ్వు ఏదో ఒక అనారోగ్య సమస్యను తగ్గించే ఔషదగుణాల్ని కలిగి ఉంటుంది. అవును బతుకమ్మ పువ్వులు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ఇంతకీ ఏ పువ్వు ఎలాంటి సమస్యను తగ్గిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
తంగేడు పువ్వులు
పసుపు రంగులో ఉండే తంగేడు పూల అందాన్ని వర్ణించతరం కాదు. ఈ పువ్వులతోనే ముందుగా బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మకు ఈ పువ్వులే అందాన్ని తెస్తాయి. అయితే పువ్వులు మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పువ్వు శాస్త్రీయ నామం కేసియా అరికులేటా. ఇది పీరియడ్స్ రెగ్యులర్ గా అయ్యేందుకు సహాయపడుతుంది. అంతేకాదు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అంతేకాడు డయాబెటీస్ ను కంట్రల్ లో ఉంచుతుంది. ఒంటి వేడిని తగ్గిస్తుంది. మీకు తెలుసా? తంగేడు పువ్వులు బ్యాక్టీరియాను చంపుతాయి.
మందారం
మందార పువ్వు శాస్త్రీయ నామం హైబిస్కస్. ఈ పువ్వులు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. మందార నూనె మన వెంట్రుకలకు ఎంతో మేలు చేస్తాయి. ఈ నూనె వెంట్రుకలు తెల్లబడకుండా చేస్తాయి. అంతేకాదు మందార పువ్వును ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా ఉపయోగిస్తారు తెలుసా?
తామర పువ్వు
అందంగా వికసించే తామర పవ్వులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పువ్వును సుగంధ ద్రవ్యాల్లో ఉపయోగిస్తాయి. అలాగే తామర నూనెను కాన్స్టిపేషన్ సమస్య ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఇది చర్మ అలెర్జీలను తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాదు ఇది మన మెదడును, లివర్ ను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. మొత్తంగా తామర మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రుద్రాక్ష పువ్వులు
రుద్రాక్ష పువ్వుల్లో కూడా ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ పువ్వును జెల్లీ, కేక్ లను తయారుచేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు ఈ గింజలు చర్మ వ్యాధులను దూరం చేస్తాయి. పండ్లను తగ్గిస్తాయి. ఇందుకోసం ఈ గింజలను వేసిన నీళ్లతో స్నానం చేయాలి
గునుగు పూలు
గునుగు చెట్టుకు కాసే పువ్వులే గునుగు పూలు. ఇవి గడ్డిజాతికి చెందిన పువ్వులు. ఈ చెట్టు ఆకులను కూరగా చేసుకుని తింటారు. ఈ కూరను తింటే డెలివరీ నార్మల్ అవుతుందని నిపుణులు చెబుతారు. ఇకపోతే ఈ గునుగు పూవులు మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పువ్వును ఉపయోగించి గాయాలను తగ్గించుకోవచ్చు. అంతేకాదు డయేరియా, దగ్గు, అధిక రక్తపోటు, టీీ వంటి సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాదు గునుగు పువ్వులోని గింజలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను కూడా తగ్గిస్తాయి తెలుసా?
బంతిపూలు
బంతిపువ్వు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. దీనిలో చలువ చేసే గుణం ఉంటుంది. అందుకే బాడీ హీట్ ఎక్కువగా ఉండేవారు దీన్ని తీసుకుంటారు. అంతేకాదు ఇది రక్తసరఫరాను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని ఎన్నో ఔషదాల్లో ఉపయోగిస్తాయి.
గుమ్మడి పూలు
గుమ్మడికాయ, గుమ్మడి గింజలే కాదు గుమ్మడి పూలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పువ్వులో విటమిన్ సితో పాటుగా విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పువ్వు ఎన్నో చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఇది డ్రై స్కిన్ సమస్య ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.