ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, జిమ్ లో కసరత్తులు చేయాలని నిపుణులు చెబుతుంటారు. మనిషి ఆరోగ్యంగా ఉండి... మందు, సిగరెట్లు లాంటి అలవాట్లు లేకపోతే... వారికి సంతానం విషయంలో పెద్దగా సమస్యలేమీ తలెత్తవు. అయితే... ఈ మధ్యకాలంలో... పురుషులు జిమ్ లో చేసే కసరత్తుల కారణంగానే వారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోందని నిపుణులు చెబుతున్నారు.

మీరు చదివింది నిజమే. కండలు పెంచాలనే కసితో ఎక్కువగా కసరత్తులు చేయడం, స్టెరాయిడ్స్ తీసుకోవడం లాంటివి చేస్తున్నారట. దాంతో.. సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. దీన్ని 'మాస్‌మ్యాన్-పేసీ పారడాక్స్' అని పిలుస్తున్నారు. దీనివల్ల, సంతానోత్తి కోసం ప్రయత్నిస్తున్న జంటల్లో గుండెనొప్పి వచ్చే ప్రమాదం కూడా అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలను ఆకర్షించేందుకు కసర్తులు చేసి.. స్టెరాయిడ్స్ వాడి కండలు పెంచుతున్నారు. కానీ చివరకు బెడ్ మీద ఫెయిల్ అవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. స్టెరాయిడ్స్ అతిగా వాడే వారిలో సెక్స్ సమయంలో కనీసం వీర్యం కూడా రావడం లేదని వారు చెబుతున్నారు.

అనబాలిక్ స్టెరాయిడ్స్ వాడకం వల్ల, వృషణాల్లో వీర్యం అధికంగా చేరుతోంది. మెదడులోని పిట్యుటరీ గ్రంధి భ్రమిస్తుంది. దీంతో, వీర్యం ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే ఎఫ్.ఎస్.హెచ్, ఎల్.హెచ్. అనే హార్మోన్ల ఉత్పత్తిని పిట్యుటరీ గ్రంధి నిలిపివేస్తుంది.

బట్టతల బారిన పడకుండా వాడే కొన్నిరకాల మందుల వలన కూడా ఇలాంటి సమస్యే తలెత్తుతుందని అధ్యయనకారులు చెబుతున్నారు.