సెల్ఫీల మోజులో ప్రాణాలు బలి...నీటమునిగి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా నర్సింగపూర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్సారెస్పీ కెనాల్లో పడి ఇద్దరు యువకులు నీటిలో గల్లంతయి శవాలుగా తేలారు.
![two young boys death in manchiryal two young boys death in manchiryal](https://static-gi.asianetnews.com/images/01djpd7bb4zdjnfqjkzxhdyac8/canal-jpg_363x203xt.jpg)
జగిత్యాల జిల్లా నర్సింగపూర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్సారెస్పీ కెనాల్లో పడి ఇద్దరు యువకులు నీటిలో గల్లంతయి శవాలుగా తేలారు. కెనాల్ వద్ద సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తు యువకులిద్దరు అందులో పడి మృతిచెందారు.
నర్సింగపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు మిత్రులు కలిసి రాత్రి ఎస్సారెస్పీ కెనాల్ వద్దకు వెళ్లారు. అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా వుండటంతో యువకులు తమ సెల్ ఫోన్లలో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. ఈ క్రమంలోనే ఇద్దరు కిరణ్, రవి అనే ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. నీటి ప్రవాహం ఎక్కువగా వుండటంతో వారిద్దరు కొట్టుకుపోయారు.
read more హైదరాబాద్ లో దారుణం... కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన డెంటల్ డాక్టర్
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అర్ధరాత్రి ఘటనాస్థలానికి చేరుకుని గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్ఆర్ఎస్పి అధికారులకు సమాచారం అందించి కాలువ నీటిని నిలిపివేయించి అర్ధరాత్రి వరకు కెనాల్ వెంట గాలింపు చేపట్టారు. దీంతో వంజరిపల్లె వద్ద రవి మృత దేహం, వెల్దుర్తి శివారులో కిరణ్ మృతదేహం లభించింది. అక్కడే శవ పంచనామా నిర్వహించి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే యువకుల మృతదేహాలపై గాయలున్నట్లు కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేందుకు మృతిచెందిన ఇద్దరు యువకులతో పాటు కెనాల్ వద్దకు వెళ్లిన గురు అనే యువకున్ని పోలీసులు విచారిస్తున్నారు.