కరీంనగర్: ఎస్సారెస్సీ కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటన కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

ఈ ప్రమాదానికి సంబంధించి కరీంనగర్ రూరల్ సిఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొమ్మకల్ గ్రామానికి చెందిన యాకయ్య (45), కొత్తపల్లి మండలం చింతకుంట శాంతి నగర్ కు చెందిన అంకుష్(40), పప్పు రవి లు  ప్లంబర్ వృత్తిపై జీవనోపాధి పొందుతున్నారు. వీరు ముగ్గురూ కలిసి రేకుర్తి శివారులోని షేకాబి కాలనీలో బహిరంగ ప్రదేశంలో విందు చేసుకునేందుకు వెళ్లారు. 

read more   కాలువలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం...మానవత్వాన్ని చాటుకున్న యువకులు, పోలీసులు

విందు పూర్తిచేసుకుని కాలువలో చేతులు కడుక్కునేందుకు దిగగా ప్రమాదవశాత్తు కాలువలో జారిపడ్డారు. రక్షించేందుకు మరొకరు దిగి మృతి చెందారు. ఇలా యాకయ్య, అంకుష్ ఇద్దరు ప్రాణాలు వదిలగా రవి ప్రాణాలతో బయటపడ్డారు. 

ఇది గమనించిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. కొత్తపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటికి తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ రూరల్ సిఐ తుల శ్రీనివాసరావు తెలిపారు.