జ‌గిత్యాల: జిల్లాలోని మ‌ల్యాల మండ‌ల కేంద్రానికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అనుమానా‌స్ప‌ద స్థితిలో మృతి చెందింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థిని తేజ‌స్విని అంత్య‌క్రియ‌ల‌ను ర‌హ‌స్యంగా నిర్వ‌హించేందుకు త‌ల్లిదండ్రులు య‌త్నించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని అంత్యక్రియలకు సిద్దమైన వారిని అడ్డుకున్నారు. 

మృతురాలి మెడ‌పై గాయాలు ఉండ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. తేజ‌స్విని ఎవ‌రైనా హ‌త్య చేశారా? లేక ఆత్మ‌హ‌త్య చేసుకుందా? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. తల్లిదండ్రులు గుట్టుగా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించడంతో పరువు హత్యకు పాల్పడ్డారా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

read more  రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం...సర్పంచ్ సహా ముగ్గురు మృతి

మృతురాలు బాస‌ర ట్రిపుల్ ఐటీలో బీటెక్ థ‌ర్డ్ ఇయ‌ర్ చ‌దువుతోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా కళాశాలలకు సెలవు వుండటంతో ఇంటివద్దే వుంటోంది. ఈ క్రమంలో ఇంటివద్దే ఇలా అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.