''ఆర్టిసి కార్మికుల కడుపు మండుతుంటే... ప్రగతిభవన్ లో యాటల కోత''
తెలంగాణ బిడ్డలైన ఆర్టిసి కార్మికుల తమ హక్కుల సాధన కోసం పోరాడుతుంటే ముఖ్యమంత్రి కేసీఇర్ మాత్రం ప్రగతిభవన్ లో జల్సాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.
కరీంనగర్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టిసి కార్మికులు తమ డిమాండ్ల సాధనకోసం సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి పట్టించేకోకుండా ప్రగతిభవన్ లో యాటలు కోస్తూ సంబరాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కేవలం ప్రగతిభవన్ లో బతుకమ్మ సంబరాలు జరిగితే సరిపోదని... ప్రతి ఇంట్లో ఆ సంబరాలు జరగాలన్నారు. కానీ ఈసారి కేసీఆర్ నిరంకుశత్వం కారణంగా ఈసారి తెలంగాణ బిడ్డలైన ఆర్టిసి కార్మికులు పండగపూట పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
జగిత్యాల పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కు సంఘీభావంగా అఖిలపక్షం ఆద్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఇంటి నుండి స్థానిక ఆర్టీసీ డిపో వరకు జరిగిన ఈ బైక్ ర్యాలీలో పెద్దఎత్తున ఆర్టిసి కార్మికులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, సామాన్య ప్రజలు పాల్గొన్నారు.
బైక్ ర్యాలీ అనంతరం ఆర్టీసీ డిపో వద్దే జీవన్ రెడ్డి మాట్లాడుతూ... రాజ్యాంగ బద్దంగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు రాజ్యాంగ బద్దంగా పాలన కొనసాగిస్తున్నాడా? అని ప్రశ్నించారు.
telangana bandh video : kcr ని గద్దె దించేదాకా వదలం - ఓయూ జేఏసీ...
తెలంగాణ ఉద్యోగులు, ప్రజలంతా కలిసి చేపట్టిన సకల జనుల సమ్మెతోనే కేంద్రం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేసింది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నాడని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ రాజ్యం రాజ్య హింసగా మారుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కుట్రపూరితంగానే ఆర్టీసీ నష్టాల్లో వుందని పదేపదే చెప్తున్నాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సంస్థకు ఏకంగా 50 వేల కోట్ల ఆస్తులుంటే వాటిని తక్కువ చూపిస్తున్నాడని విమర్శించారు.
బడా కార్పోరేట్ సంస్ధలకు చెందిన ప్రైవేటు పెట్టుబడిదారులకు ఆర్టిసిని అప్పనంగా అప్పగించాలని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నాkన్నారు. అందువల్లే ఇలా కార్మికులపై జులుం ప్రదర్శించి భయపెడుతున్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
RTC Strike:తెలంగాణ బంద్‌కు ఆంధ్రా మద్దతు...విశాఖలో ఆందోళన...
కొత్త హైర్ బస్సులను కొనడానికి ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు 90 శాతం అప్పులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయన్నారు. పదవీ విరమణ పొందిన కాలీలే ఆర్టీసీలో దాదాపు 6000 లు ఉన్నాయన్నారు. వాటిని ఇప్పటివరకు భర్తీ చేయకపోడానికి కూడా కారణమిదేనని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కి హైకోర్టు చెంప చెల్లుమనిపించి కార్మికులకు మద్దతుగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 2లక్షల 50 వేల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెత్తుతున్నాడు. ఇలా ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో భారీగా అప్పులు చేసిన ఆయన ఆర్టిసి పై కూడా అప్పుల భారం నెట్టాడన్నారు.
అవసరమైతే ఆర్టీసీ కార్మికులతోని కొత్త హైర్ బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పోవాలంటే ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడమే ఏకైక మార్గమని...అది నేరవేరేవరకు ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని ఉద్యోగులకు జీవన్ రెడ్డి సూచించారు.