కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. నిరుపేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వద్ద ఓ కామాంధుడు మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక అతడి నుండి ఎలాగోలా తప్పించుకుని తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 

ఈ  దారుణ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో భారీగా డబులు బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అయితే నిర్మాణంలో వున్న ఓ సముదాయంలోకి మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను తీసుకెళ్లాడు చందనం ప్రశాంత్ అనే యువకుడు. అక్కడ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడగా ఆమె నిరాకరించి ఎలాగోలా అతడి నుండి తప్పించుకుంది. 

read more  పరాయి స్త్రీతో అల్లుడు అక్రమ సంబంధం.. మామ ఏం చేశాడంటే..

ఈ క్రమంలో బాలిక ఈ విషయం ఎవరికయినా చెబుతుందేమో అన్న భయంతో ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడి దాడి నుండి కూడా తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. 

బాలిక తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాదిత బాలికను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు ప్రశాంత్ పరారీలో వున్నాడని... అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.