కరీంనగర్: విద్యార్థులు, మహిళలని వేదిస్తే కఠినంగా వ్యవహరిస్తామని... వేధింపుల నియంత్రణ కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించామని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ  అన్నారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని గ్రౌండ్ -2 లో  బెల్లంపల్లి పోలీసుల ఆధ్వర్యంలో ''మీకోసం మేమున్నాం - మీ  భద్రతకు భరోసా ఇస్తున్నాం'' పేరుతో జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ... మహిళల రక్షణ కోసం పోలీసులు అనేక చర్యలు చేపడుతున్న అక్కడక్కడ సంఘటనలు  జరుగుతుండడం దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలు జరగకుండా మహిళలు యువతులు బాలికలు కూడా స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. చదువుకునే సమయంలో ప్రేమ పేరుతో విలువైన జీవితం నాశనం చేసుకోవద్దని, మహిళలు ఏలాంటి ఇబ్బంది కలిగిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

మహిళలను, యువతులను ఇబ్బందులకు గురి చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం కేటాయిస్తూ వారిలో ఆత్మ స్థైర్యం పెంపొందించాలి అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు నైతిక విలువలు బోధించాలని,  అబ్బాయిల ప్రవర్తన ఎప్పటికప్పుడు తల్లితండ్రులు  గమనించాలని వారిని సన్మార్గంలో నడిపించాలని  తెలపడం జరిగింది. సమాజంలో తలెత్తుతున్న సమస్యలను విధానాలను పిల్లలకు వివరించాలి, మహిళల పట్ల క్రమశిక్షణ గా ఉండేలా చూడాలి. రాత్రి వేళల్లో అత్యవసరం అనుకుంటే తప్ప పిల్లల్ని బయటకి పంపించ కూడదు అని సూచించారు.

read more సమ్మె కాలంలో ఆర్టీసీలో భారీ అవినీతి...: అశ్వత్థామ రెడ్డి

రామగుండం కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ చబుత్రా

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు లో ఆపరేషన్ చబుత్రా  ఏర్పాటు చేసినట్లు సిపి చెప్పారు. జులాయిలు పోకిరీలు, మద్యం తాగి వీరంగం సృష్టించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు దానిలో భాగంగా ఆపరేషన్ చబుత్రాలో పట్టుబడిన యువకులను మొదట తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని, వారి ప్రవర్తన మార్చుకోకుండా మరల పోలీసులకు పట్టుబడితే చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో 147 డార్క్ స్పాట్ లను  గుర్తించడం జరిగిందన్నారు. ఆ ప్రదేశాలలో పెట్రోల్ కార్స్ బ్లూ క్లోట్స్  సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు

డయల్ 100 వచ్చే కాల్స్ ను ప్రతి రోజు పర్యవేక్షించడం, స్వయంగా పర్యవేక్షించడం జరుగుతుందని, పట్టణాలలో 5 నుండి 10 నిమిషాల లోపు గ్రామాలలో  10 నుండి 20 నిమిషాల లోపు పెట్రోల్ కార్, బ్లూ కోల్ట్స్, సిబ్బంది వెళ్లి సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. డయల్ 100 తో పాటుగా వివిధ రకాల టోల్ ఫ్రీ నెంబర్లు మహిళా రక్షణ కోసం అందుబాటులో ఉన్నాయని, షీ టీమ్స్ నిరంతరం డేగ కళ్ళతో మహిళల రక్షణ కోసం పని చేస్తున్నాయని పోలీస్ అధికారులు చెప్పారు.

read more సికింద్రాబాద్ అబ్బాయి- జర్మనీ అమ్మాయి .... ఎల్లలు దాటిన ప్రేమ

మహిళలకు మరియు ప్రజలకు ఏ సమస్య ఉన్నా డయల్ 100 రామగుండం  పోలీస్ కమిషనరేట్ షీ టీమ్ వాట్సాప్ నెంబర్ 6303923700 లకు, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 112, 1090, 1091 ఫోన్ నెంబర్ లు అందుబాటులో ఉన్నాయన్నారు.  పై నంబర్లలో ఏదో ఒకదాని ఫోన్ చేసి తాము ప్రమాదం లో ఉన్న సమాచారాన్ని అందిస్తే రక్షణ పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా *181 నెంబర్  కి కాల్  చేసిన  బాధితులకు సాయం అందుతుంది. ఫోన్ చేసి  పోలీసుల సేవలు వినియోగించుకోవాలని తెలిపారు.

ప్రజలు, మహిళలు ఏ సమస్య ఉన్నా రామగుండము పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 9440900683  కాల్ చేసి తెలిపిన  వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని ఈ నెంబర్ ను కమిషనర్ స్వయంగా పర్యవేక్షణ చేస్తారు.