గత 45 రోజులుగా RTC కార్మికులు సమ్మె చేస్తుంటే మంత్రులు మాట్లాడకపోవడం నిరసిస్తూ  ఆర్టీసీ కార్మికులు వినూత్నంగా నిరసనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రులు ఏ రకంగా అయితే భజన చేస్తున్నారో అదే పద్ధతిలో కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు వినూత్నంగా KCR చుట్టూ మంత్రులు భజన చేస్తున్నట్లుగానే అదే పధ్ధతిలో బజాన చేస్తున్నారు.

also read: #RTC strike పంతం నెగ్గించుకున్న పోలీసులు: అశ్వత్థామరెడ్డి దీక్ష భగ్నం, అరెస్ట్

టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నిన్న ఉదయం నుంచి ఇంట్లోనే దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో వైద్యులు సైతం దీక్ష విరమించాల్సిందిగా అశ్వత్థామరెడ్డిని కోరారు. వారి సూచనను కూడా పట్టించుకోకపోవడంతో పోలీసులు అశ్వత్థామరెడ్డి దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. 

ఆర్టీసీ సమస్యకు పరిష్కారం చూపెట్టాలంటూ నిన్న దీక్షకు దిగిన అశ్వత్థామరెడ్డి, రెండో రోజు కూడా తన దీక్షను కొనసాగిస్తున్నాడు. బిఎన్ రెడ్డి నగర్ లోని తన ఇంటిలో తన దీక్షను కొనసాగిస్తున్నాడు. 

ఆర్టీసీ సమస్యకు పరిష్కారం చూపెట్టాలని ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు మద్దతుగా నిన్న ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆఫీసులో దీక్షకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిన్ననే జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డిని అరెస్ట్‌ చేశారు. 

Also Read:RTC Strike: రెండో రోజూ కొనసాగుతున్న అశ్వత్థామరెడ్డి దీక్ష

అశ్వత్థామరెడ్డిని కూడా అరెస్ట్‌ చేసేందుకు నిన్న ఉదయం నుండే ఆయన ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అశ్వత్థామరెడ్డి ఇంటికి ఆర్టీసీ కార్మికులు భారీగా చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు పోలీసుల యత్నించారు. దానితో పోలీసుల మధ్య కార్మికుల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. 

అశ్వత్థామరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచడంతో ఆయన ఇంట్లోనే దీక్షకు దిగారు. నిన్న ఉదయం నుంచి బిఎన్ రెడ్డి నగర్ లోని ఆయన ఇంట్లోనే దీక్షకు దిగారు. నిన్న రాత్రి పోలీసులు తాళాలు పగలగొట్టి లోపలి పోవాలని యత్నించినప్పుడు, తనను అరెస్ట్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. 

Also Read:RTC Strike: మహా దీక్ష నేపథ్యంలో మందకృష్ణ హౌస్ అరెస్ట్

నేటి ఉదయం ఆయన్ను పరిశీలించిన వైద్యులు ఆయన బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ తగ్గాయని చెప్పారు. ప్రస్తుతానికి ఆయన నివాసం వద్ద పోలీసులు మాత్రం భారీ సంఖ్యలో మోహరించారు. వైద్యులు కూడా అక్కడే అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో  ఆనాడు జేఎసీ పిలుపు మేరకు సకల జనుల సమ్మె నిర్వహించారు.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె కీలకమైన ఉద్యమం. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు  ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 42 రోజుల పాటు సమ్మె  చేశారు. ఈ సమ్మెలో ఆర్టీసీ, తెలంగాణ ఎన్‌జీవోలు, సింగరేణి కార్మికులు కీలకంగా ఉన్నారు.