Asianet News TeluguAsianet News Telugu

ఈత సరదా: జగిత్యాల ఎస్సారెస్పీ కెనాల్‌లో కోరుట్ల ఎమ్మెల్యే పీఏ గల్లంతు

జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఎస్సారెస్పీ కాలువలో ఒకరు గల్లంతయ్యారు. పట్టణానికి చెందిన విజయ్,బాలన్, రామకృష్ణలతో పాటు ఠాకూర్ గిరీష్ ఎస్సారెస్సీ కెనాల్‌లో ఈతకొట్టేందుకు వెళ్లారు. కాల్వలోకి దిగిన గిరీష్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. 

korutla mla vidyasagar PA missing in jagtial srsp canal
Author
Jagtial, First Published Nov 3, 2019, 8:09 PM IST

జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఎస్సారెస్పీ కాలువలో ఒకరు గల్లంతయ్యారు. పట్టణానికి చెందిన విజయ్,బాలన్, రామకృష్ణలతో పాటు ఠాకూర్ గిరీష్ ఎస్సారెస్సీ కెనాల్‌లో ఈతకొట్టేందుకు వెళ్లారు. కాల్వలోకి దిగిన గిరీష్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు.

"

అతనిని రక్షించేందుకు మిగిలిన ముగ్గురు ప్రయత్నించారు. అయితే సమీపంలో ఎవరు లేకపోవడంతో గిరీష్ గల్లంతయ్యాడు. గిరీష్ సింగ్ టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయనకు పీఏగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు‌కు పీఏగా వ్యవహరిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గిరీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

"

కొద్దిరోజుల క్రితం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లిన కారును అధికారులు బయటకు తీశారు. స్థానికులు, అధికారుల సాయంతో 18 గంటల పాటు శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం కారును బయటకు తీసింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారంతా మరణించారు. మృతులను అబ్ధుల్ అజీజ్, జిన్సన్, రాజేశ్, సంతోష్, పవన్, నగేశ్‌‌గా గుర్తించారు. 

Also Read:Video: నాగార్జునసాగర్‌ ఎడమకాల్వలోకి దూసుకెళ్లిన కారు: వెలికితీసిన ఎన్టీఆర్ఎఫ్

స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తూ ఆనందంగా తిరిగి వస్తున్నారు. కానీ.. ఆ ఆనందం ఆవిరైపోయింది. కారు సాగర్ లోకి దూసుకువెళ్లి పోయింది. దీంతో... ఆరుగురు గల్లంతయ్యారు. ఈ సంఘటన కోదాడలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని చాకిరాల గ్రామం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం (ఏపీ31 బిపి 338) అదుపుతప్పి నాగార్జున సాగర్‌ ఎడమ కాలువలో కి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు హైదరాబాద్‌ వాసులు గల్లంతయ్యారు.

Also Read:స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం... ఆరుగురు గల్లంతు

ఆస్పత్రిలో అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న విమలకొండ మహేశ్‌ వివాహానికి శుక్రవారం ఉదయం వీరంతా రెండు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా స్కార్పియో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

గల్లంతయిన వారంతా ఈసీఐఎల్‌లోని అంకుర ఆస్పత్రి ఉద్యోగులు అని తెలిసింది. గల్లంతయినవారిలో అబ్దుల్‌ అజిత్‌ (45), రాజేష్‌ 29), జాన్సన్‌ (33), సంతోష్‌ కుమార్‌ (23),నగేష్‌ (35) పవన్‌ కుమార్‌ (23) ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకుని పోలీసులు, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ తదితరులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గల్లంతయినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios