కరీంనగర్ కార్పోరేషన్ లో ఆగని గంగుల వ్యూహాలు... టీఆర్ఎస్ లో భారీ చేరికలు
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి...టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది అయినప్పటికిి మంత్రి గంగుల కమలాకర్ ఇంకా తన వ్యూహాలకు పదును పెడుతూనే వున్నారు. తాజాగా ఇండిపెండెంట్ అభ్యర్ధులను టీఆర్ఎస్ లోకి చేర్చుకుని మరింద బలోపేతం చేశారు.
అమరావతి: కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన ఇండిపెండెంట్ అభ్యర్ధులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ లో చేరిన వారిలో కోటగిరి భూమా గౌడ్, కొలిపాక అంజయ్య, సుదగోని మాధవి, ఎదుల్ల రాజశేఖర్, ఆకుల నర్మద- నర్సయ్య ,ఐలేందేర్ యాదవ్ , లెక్కల స్వప్న-వేణుగోపాల్ లు వున్నారు.
ఈ చేరికల సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ... ఎన్నికలు ఏవైనా గెలుపు గులాబీదేనన్నారు. ప్రజలు ఆదరించినందున మరింత ఉత్సాహంతో పనిచేసి నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించినందున తమ పార్టీ సభ్యులంత రాజకీయాలకతీతంగా పని చేస్తామని అన్నారు.
రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించే టీఆర్‌ఎస్ సర్కార్‌కే పట్టణ ప్రజల మద్దతు ఉన్నదని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నిరూపించారని మంత్రి అన్నారు. పల్లెలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన టీఆర్‌ఎస్ పార్టీకి పట్టణాలను కూడా ఇదేస్థాయిలో తీర్చిదిద్దుతుందని ప్రజలు నమ్మి 95 శాతం మున్సిపాలిటీలను గెలిపించారన్నారు.
read more ఏపి మండలిరద్దుకు కేసీఆర్ సాయం...జగన్ కోసం క్షుద్ర పూజలు...: బుద్దా వెంకన్న సంచలనం
రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస ఓటమి చెందుతున్నా ఆ పార్టీ నాయకులకు జ్ఞానోదయం కలుగడం లేదన్నారు. బీజేపీకి అభివృద్ధితో పనిలేదని, ఓట్లకోసమే రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ను గెలిస్తే ఎంఐఎం మేయర్ అవుతుందని అసత్యప్రచారాలు చేశారని, బీజేపీ ఎంపీ సంజయ్ అన్న మాటలను ఇక్కడి ప్రజలు విశ్వసించలేదన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కార్పొరేషన్ ను సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. దేశంలో ఎన్నడూలేని విధంగా, ఏ పార్టీకి రానన్ని సీట్లు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు కట్టబెట్టారని ఇందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే కారణమని మంత్రి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నందునే అన్ని ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతున్నారని పేర్కొన్నారు.
read more ఏపి శాసనమండలి రద్దు... ఆర్టికల్169 ఏం చెబుతోందంటే..: కనకమేడల
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను పట్టణ ప్రజలకు అందడంతోనే మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా ప్రజలు మాత్రం టీఆర్‌ఎస్ పార్టీకి అండగా ఉన్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్నిరంగాల్లో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కేటీఆర్ ను కలిసిన వారిలో మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ ,నందేల్లి మహిపాల్ ,సుంకిశాల సంపత్ రావు ,పన్యాల శ్యామ్ సుందర్ రెడ్డి లు ఉన్నారు..