కరీంనగర్ జిల్లాలో కరోనా రోగుల పట్ల అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్న ఆక్సిజన్ అందక కోవిడ్ రోగి మరణించిన ఘటన మరవకముందే మంగళవారం మరో ఘటన చోటు చేసుకుంది. కరోనాతో ఒకరోజు చనిపోతే  మరో రోజు మరణించినట్లుగా వైద్యులు రాసిచ్చారు.

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తికి చెందిన ఓ వ్యక్తి కోవిడ్ లక్షణాలతో కరీంనగర్‌ సివిల్ ఆసుపత్రిలో మరణించాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అదే రోజు మృతుడి బంధువులకు తెలియజేశారు.

Also Read:కరోనా బులిటెన్‌పై అసంతృప్తి: హైకోర్టు ముందు హాజరైన సీఎస్, వైద్యాధికారులు

దీంతో కుటుంబసభ్యులు తర్వాతి రోజు మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని ప్రయత్నించారు. అయితే అందుకు గ్రామాస్తులు ససేమిరా అనడంతో మునిసిపల్ సిబ్బంది సాయంతో కరీంనగర్‌లోనే ఖననం చచేశారు.

అయితే ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు మాత్రం ఈ నెల 21న ఆ వ్యక్తి చనిపోతే 22న చనిపోయినట్లు ఓపీ రశీదుపై రాసిచ్చారు. దీంతో మృతుడి బంధువులు అవాక్కయ్యారు. మృతుడి మనవడు సైతం అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు అనుమతి కోరుతూ 21నే గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు.

Also Read:తెలంగాణలో కరోనా: 57 వేలు దాటిన కేసులు, అట్టుడుకుతున్న హైదరాబాద్

కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం 22న చనిపోయినట్లు సర్టిఫికెట్ ఇవ్వడం జిల్లాలో చర్చనీయాంశమైంది. కరోనా వార్డును సందర్శించే వారు లేకపోవడంతో ఆసుపత్రి యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.