Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ జిల్లాలో దారుణం.. కన్నతల్లినే కడతేర్చిన మాజీ ఎంపిటీసి

 గంగిపల్లిలో  కన్న తల్లిపై ఓ మాజీ  ఎంపిటీసి కనికరం లేకుండా ప్రవర్తించాడు. జన్మనిచ్చిన తల్లి అని చూడకుండా తన రాక్షసత్వాన్ని చూపించి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. అందరిని షాక్ కి గురి చేసిన ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

karimnagar Former MPTCC killed her mother
Author
Hyderabad, First Published Nov 11, 2019, 3:40 PM IST

కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మానకొండూర్ మండలం గంగిపల్లిలో కన్న తల్లిపై ఓ మాజీ ఎంపిటీసి కనికరం లేకుండా ప్రవర్తించాడు. జన్మనిచ్చిన తల్లి అని చూడకుండా తన రాక్షసత్వాన్ని చూపించి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. అందరిని షాక్ కి గురి చేసిన ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వె;వెళితే.. బత్తిని భూమయ్య ( మాజీ ఎంపిటీసి)  సొంత  తల్లి బత్తిని కనకలక్ష్మి (73)  మరణానికి కారణమయ్యాడు. ఇనుప రాడ్ తో దాడి చేయడంతో బత్తిని కనకలక్ష్మి కు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ ఆసుపత్రికి తరలింపు భూ పంపకాల విషయమే దాడికి కారణమంటున్న స్థానికులు చెబుతున్నారు.  ఆలస్యం గా వెలుగులోకి వచ్చిన ఘటనతో పోలీసులు కేసు నమోదు చేశారు.  బాధితురాలికి ముగ్గురు కొడుకులు  దాడి చేసిన వ్యక్తి పెద్ద కొడుకు ఇంతకుముందుమాజీ ఎంపిటీసి గా వర్క్ చేసినట్లు తెలుస్తోంది.

aslo read: ఆగిన మరో గుండె: కరీంనగర్ లో కరీం ఖాన్ మృతి

కరీంనగర్‌: కరీంనగర్ -2 ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న గ్యారేజీ కార్మికుడు కరీం ఖాన్ బుధవారం నాడు గుండెపోటుతో మృతి చెందాడు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బాబు అనే ఆర్టీసీ డ్రైవర్ గత నెల 30వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే.

కరీంనగర్-2 ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కరీంఖాన్ ఆర్టీస డిపోలో పనిచేస్తున్నాడు. గత నెల 5 వతేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో కరీం ఖాన్ రెండు మాసాలుగా సమ్మెలోనే ఉన్నాడు.

అయితే కరీం ఖాన్ గుండెపోటుతో మంగళవారం నాడు ఉదయం మృతి చెందినట్టుగా ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 5వ తేదీ రాత్రి లోపుగా విధుల్లో చేరాలని డెడ్‌లైన్ విధించారు. ఈ డెడ్‌లైన్ పూర్తైంది. 

 కరీమ్ మృతికి ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కరీమ్ ఖాన్ కరీంనగర్ రెండవ డిపోలో మెకానిక్​గా పనిచేస్తున్నాడు. గత 15 రోజుల క్రిత కరీమ్​కి గుండెపోటు వచ్చింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు

 రెండ్రోజుల తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు. కొద్ది రోజుల క్రితం డ్రైవర్ బాబు అంతిమయాత్రలో పాల్గొన్నాడు. అక్కడ మరోసారి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయినట్టుగా  కుటుంబసభ్యులు చెప్పారు. వెంటనే కరీం ఖాన్ ‌ను ప్రతిమ ఆసుపత్రికి తరలించారు.కరీం ఖాన్ ప్రతిమ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు ఉదయం మృతి చెందాడు. 

.

Follow Us:
Download App:
  • android
  • ios