కరీంనగర్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలయ్యింది. ఈ సందర్భంగా గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పక్కా వ్యూహాలతో ముందుకు కదులుతున్నాయి.  ఈ క్రమంలో కరీంనగర్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో వున్న బిజెపిలు దూకుడుగా ప్రచారంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ కూడా బరికి సిద్దమయ్యాయి. 

అయితే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాన్ని పునరావృతం చేయాలని స్థానిక ఎంపీ బండి సంజయ్ కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుండి పట్టణ స్థాయి ముఖ్య నాయకులను చేర్చుకుంటున్నారు. ఇలా తాజాగా మాజీ కౌన్సిలర్, మాజీ అర్బన్ డైరెక్టర్ వరాల జ్యోతి తన అనుచరులతో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ బండి సంజయ్ స్వయంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఎంపీ సంజయ్ మాట్లాడుతూ... వారు కర్రలు పడితే మేం కత్తులు పడుతాం... కత్తులు పడితె బాంబులు పడుతాం.... బాంబులు పడితే లాంచర్లు వేస్తాం అన్న వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని అన్నారు. ఇప్పటికే భారతీయులకు బారతీయేతరులతో యుద్దం మెదలయిందన్నారు. అసలైన ముస్లింలు సిటజన్స్ అమెంట్ మెంట్ యాక్ట్ కు  సపొర్ట్ చేస్తున్నారన్నారు. 

read more  మున్సిపల్ పోల్స్: ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ

జిహాదీ ముసుగులొ ఉన్న వారే సీఎఎ కు వ్యతిరేఖంగా పోరాటం చేస్తున్నారన్నారు. జిహాదీలకు అనుకూలంగా సపోర్ట్ చేసిన అసదుద్దిన్ ఓవైసి నిజమైన జిహాదీ అని.. ఇస్లామిక్ దేశాల నుండి వచ్చిన ఫండ్స్ తోనే క్రుతిమ ఉద్యమాలు చేస్తున్నారన్నారు. జీహాదీలకు అనుకూలంగా అసుదుద్దిన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంపీ తెలిపారు.

హైద్రాబాద్ లొ 10 వేల మంది రోహింగ్యాలు ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. రోహింగ్యాలకు ఓటర్ కార్డు, అధార్ కార్డ్ ఎవరి ద్వారా వచ్చాయని ప్రశ్నించారు. పాతబస్తీలొ స్దానికుల మద్దతు లేకుండా రొహింగ్యాలు ఆశ్రమం పొందగలరా అని నిలదీశారు.  

భారతరాజ్యాంగం, భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేఖంగా వెలిసిన గొడ రాతలపై రాజకీయ పార్టీలు స్పందించాలన్నారు. సీఎఎ ను భూచిగా చూపి గొడవలు సృష్టించాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ తీసుకవచ్చిన ప్రతి వాటిని వ్యతిరేఖించాలని వారు చూస్తున్నారని అన్నారు.

ఇస్లాంమిక్ దేశాల నుండి వచ్చిన డబ్బులతొ క్రుత్రిమ ఉద్యమాలు జరుగుతున్నాయని అన్నారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది కొసమే ఎన్నికల్లో విజయం సాదించేందుకే  సీఎఎ పై విమర్శలు  చేస్తున్నాయని అన్నారు. గతంలో లుంబినీపార్క్, గొకుల్ చాట్ దాడులు చేసింది జీహాదీలు కాదా అని ప్రశ్నించారు. 

జీహాదీలకు బీర్లు బిర్యానీలు పెట్టి పోషిస్తున్నారని... వారిని ఎన్కౌంటర్  చేయవద్దు అని ప్రకటనలు చేస్తున్నా రాజకీయ పార్టీలు ఎందుకు స్పందిచడం లేదని నిలదీశారు. వెంంటనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి ని అరెస్ట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.