కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని తెలంగాణ బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి  గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోను కాంగ్రెస్, బీజేపీ ల అడ్రస్‌ గల్లంతు అవడం ఖాయమన్నారు.    

మంగళవారం మంత్రి కార్యాలయంలో  కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ కార్పొరేటర్ మేచినేని అశోక్ రావు , బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘ నాయకులు దామర మహేంద్ర రెడ్డిలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్వయంగా మంత్రి గంగుల వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వందకు వంద‌శాతం కరీంనగర్  లో గులాబీ జెండా ఎగరడం‌  ఖాయమన్నారు. కష్టపడే అభ్యర్థులనే పార్టీ మున్సిపల్ అభ్యర్థులను నిలబెడుతుందని, కొత్త చట్టం ప్రకారం పని చేసే వారే  ఎన్నికల్లో సేవకులుగా నిలబడాలని అన్నారు.

read more రాజకీయాల్లో హత్యలుండవు... ఆత్మహత్యలే: మరోసారి ఈటల కీలక వ్యాఖ్యలు

కార్యకర్తలు ఐక్యంగా ఉండి గులాబీ పార్టీ ‌నిలబెట్టే అభ్యర్థులను గెలిపుకు కృషి చేయాలని అన్నారు. పల్లె ప్రగతి‌ లాగానే ఎన్నికల‌ తర్వాత పట్టణ ప్రగతి కార్యక్రమం  నిర్వహించుకుందామని అన్నారు. 

అభివృద్ధి లో‌‌ తెలంగాణ ‌దేశానికి రోల్ మోడల్ అని..అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కరీంనగర్ రెండవ స్థానం కోసం పోటీ పడుతుందని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ను ఆదర్శంగా  తీర్చిదిద్దుకుందామని అన్నారు. 

ఈ చేరికల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టి. సంతోష్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ , మెతుకు సత్యం, గంగుల అశోక్ ,ఒంటెల సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.