Asianet News TeluguAsianet News Telugu

Karimnagar Bandh video: పోలీస్ లాఠీచార్జీ... ఏబీవీపీ నాయకుడికి తీవ్ర గాయాలు

కరీంనగర్ లో ఆర్టీసి జేఏసి చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. ఎంపీ బండి సంజయ్ పై అనుచితంగా ప్రవర్తించిన పోలీసుల తీరుకు వ్యతిరేకంగా  ధర్నా చేపట్టిన ఏబివిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.  

karimnagar bandh... abvp leader injured in police latichare
Author
Karimnagar, First Published Nov 1, 2019, 8:46 PM IST

కరీంనగర్: ఆర్టీసీ కార్మికుడు బాబు మరణానికి జెఎసి ఇచ్చిన బంద్ హింసాత్మకంగా మారింది. ఈ బంద్  కి మద్దతు తెలిపిన ఏబీవీపీ నాయకులను పోలీసులు  ఇష్టారాజ్యంగా అరెస్టులు చేశారు. ఈ క్రమంలో ఏబీవీపీ నాయకులపై పోలీసుల లాఠీఛార్జ్ చేయడంతో కొందరు నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ లాఠీచార్జీలో కిరణ్ అనే ఏబివిపి నేత తీవ్రంగా గాయపడ్డాడు. 

ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిజాం పరిపాలన విధానాన్ని అనుసరించి ఇష్టం వచ్చినట్టు లాఠీచార్జి చేసిందని ఏబివిపి నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల దౌర్జన్యం లో ఎక్కడికక్కడ ఉద్యమాలను అణిచివేస్తోందని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

read more డ్రైవర్ బాబు అంతిమయాత్ర: బీజేపీ ఎంపీ సంజయ్‌పై చేయిచేసుకున్న ఏసీపీ, ఉద్రిక్తత

పోలీసులు దాడులు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం  ప్రోత్సహింస్తోందని ఆరోపించారు. ఫ్రెండ్లీ పోలీసులంటే ఈరోజు కేవలం టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీసులుగా తయారయ్యారని అన్నారు. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వానికే సిగ్గుచేటన్నారు. 

రాష్ట్రం మొత్తం ఆర్టీసీ నాయకులు తీవ్రంగా సమ్మె చేస్తున్నా వారి డిమాండ్లను పరిష్కరించకపోవడంతో పాటు వారికి మద్దతుగా ఉన్న ఏబీవీపీ నాయకులపై దాడులు చేయడం ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు.  ఈ దాడులకు కారణమైన పోలీసులను వెంటనే విధుల నుంచి తొలగించాలని...ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి ఏబీవీపీ  నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఆర్టీసీ డ్రైవర్ బాబు మరణానికి సంబంధించి కరీంనగర్‌లో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌తో ఏసీపీ అనుచితంగా ప్రవర్తించారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్ కోర్టు సెంటర్ వద్ద బండి సంజయ్ కూడా బైఠాయించి నిరసన తెలియజేశారు. ఆర్టీసీ కార్మికుడు బాబు అంతిమయాత్రపై కూడా పోలీసుల నిర్బంధం ఏంటని విపక్షనేతలు మండిపడ్డారు. 

read more డ్రైవర్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..ఛలో కరీంనగర్ కి జేఏసీ పిలుపు
 
బాబు మృతదేహాన్ని దారి మళ్లించి వేరే చోటుకి తరలించారు. పెద్దఎత్తున ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబసభ్యులు తరలిరావడంతో ఆరేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 

ఓ పోలీస్ అధికారి  కరీంనగర్  ఎంపీ బండి సంజయ్ పై  చేయి చేసుకోవడాన్ని  నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి  తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ ప్రభుత్వ దమన నీతికి, దుర్మార్గానికి పరాకాష్ఠ అన్నారు. 

వెంటనే  డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించి  కరీంనగర్ పోలీస్ కమిషనర్, ఏసీపీ లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు . కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  ఆ అధికారులను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిన్నటి వరకు బీజేపీ కార్యకర్తలు , నాయకుల మీద కక్ష సాధింపు చర్యలుగా తప్పుడు కేసులు బనాయించి  వేధించిన పోలీసులు ఏకంగా కేసీఆర్ మెప్పు కోసం, కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ నాయకుల మీద తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. 

"

నిజామాబాద్  లో  కవిత, కరీంనగర్ లో వినోద్ రావులు ఓడిన నాటి నుంచి  కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారశైలి ఇలాగే ఉందన్నారు. రాష్ట్రంలో కేసీర్ పాలన శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తించాలని  ఆయన హితవు పలికారు. కేసీఆర్ రాక్షన పాలనకు చరమగీతం పలికే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని  అప్పటి వరకు బీజేపీ కార్యకర్తలకు  అండగతా నిలబడతామని గుర్తు చేశారు . దీని వెనక రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ హస్తం ఉన్నదని, పోలీసుల చేత మహమూద్ అలీ ద్వారా కేసీఆర్ ఈ వ్యవహరం నడిపిస్తున్నట్టు స్పష్టంగా అర్దమవుతోందని అర్వింద్ వ్యాఖ్యానించారు.

Follow Us:
Download App:
  • android
  • ios