జగిత్యాల జిల్లా కలెక్టర్  రవి ట్వీట్ వివాదాస్పదంగా మారింది. సినిమా హీరోయిన్  రష్మిక ను ఉద్దేశించి చించావు పో అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్ వివాదాస్పదంగా మారింది. దీంతో తన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారని రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also read:రాధిక కుటుంబం జల సమాధి: సీసీ కెమెరాల్లో కారు గుర్తింపు

 జగిత్యాల  జిల్లా  కలెక్టర్ రవి  సినిమా హీరోయిన్ రష్మికను ఉద్దేశించి చేసినట్టుగా చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. చించావు పో అంటూ కలెక్టర్ రవి పేరుతో కామెంట్ ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్ తాను చేయలేదని కలెక్టర్ రవి చెబుతున్నారు. ఈ విషయమై  ఆయన పోలీసులను ఆశ్రయించారు. తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని రవి  అనుమానిస్తున్నారు. తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని భావించిన కలెక్టర్ రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన విషయమై విచారణ చేయాలని రవి పోలీసులను కోరారు. 

ఇదిలా ఉంటే ఈ ట్వీట్‌ను తర్వాత డిలీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ ఎవరు చేశారు.. ఎవరు డిలీట్ చేశారనే విషయమై కలెక్టర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు  విచారణ చేయనున్నారు. కలెక్టర్ అధికారిక  ట్విట్టర్ అకౌంట్ తో ఈ ట్వీట్ చేయడం వివాదానికి కారణమైంది.