Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ కార్యకర్తల మృతి...బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ

 పార్టీ కార్యకర్తకే కాదు వారి కుటుంబాలకు కూడా టీఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కోన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రమాదవశాత్తు మృతిచెందిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను ఆయన బీమా చెక్కులను అందించారు.  

jagityal mla sanjay kumar distributes bheema cheques
Author
Karimnagar, First Published Nov 8, 2019, 8:09 PM IST

జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వాన్ని కలిగిన ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తలకు కుటుంబాలకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెక్కులను బీమా చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయానికి భీమా లబ్దిదారుల కుటుంబ సభ్యులను పిలిపించి వారికి స్వయంగా తానే చెక్కులను అందించారు.

టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాన్ని కలిగిన తోట ఎల్లయ్య  ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆయన కుటుంబం దిక్కులేక రోడ్డునపడింది. అయితే అతడికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం ద్వారా బీమా సదుపాయం లభించింది. అదే ఇప్పుడు అతడి కుటుంబాన్ని ఆదుకుంది. 

మృతుడు ఎల్లయ్య భార్య బూదవ్వ టీఆర్ఎస్ పార్టీ సహకారంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయగా బ్యాంకు ఖాతాలో రూ 2.00 లక్షలు జమయ్యాయి. ఇందుకు  సంబంధించిన పత్రాలు బూదవ్వకు ఎమ్మెల్యే అందించారు.

 read more ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ నిధులు: ఆ రూ.760 కోట్లు ఏమయ్యాయి.. సునీల్ శర్మకు నోటీసులు

ఈసందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ...పార్టీ సభ్యత్వ నమోదు సమయంలో కార్యకర్తలు జాగ్రత్త వహించాలని సూచించారు. ఏ చిన్న తప్పులు దొర్లినగని ఇన్సూరెన్స్ వారు క్లెయిమ్ సమయంలో ఒప్పుకోవడం లేదన్నారు. కాబట్టి కార్యకర్తలు , నాయకులు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవలన్నారు. లేకుంటే కోర్టుల చుట్టు తిరగాలన్నారు. 

బూదవ్వకు చెక్కు ఆలస్యం అయిన పార్టీ సహాయ సహకారాలతో డబ్బులు అందాయన్నారు. మరో 77 మందికి రూ. 2 లక్షల చొప్పున క్లెయిమ్ డబ్బులు రావడం ఆనంద దాయకన్నారు. ఎంతో వ్యయ ప్రయసాలకోర్చి ఈ భీమా డబ్బులు రావడానికి సహాయపడిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కెటిఆర్ కుఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

read more  విజయారెడ్డి హత్య కేసు... సంచలన విషయాలు బయటపెట్టిన సురేష్ భార్య

టిఆర్ఎస్ పార్టీ  కార్యకర్తనుండి అధ్యక్షులు వరకు ప్రతి విషయములో ప్రజల సంక్షేమం కొరకు పాటుపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఎంపిపి గంగారాం గౌడ్, పట్టణ అధ్యక్షులు సతీష్ మరియు ప్రశాంత్ రావులతో పాటు  బీమా లబ్దిదారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios