జగిత్యాలలో పోలీస్ కు కరోనా... మూతపడ్డ పోలీస్ స్టేషన్

జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం సృష్టించింది. ఈ ఠాణాలో పనిచేసే ఓ పోలీస్‌ కు కరోనా పాజిటివ్‌గా తేలింది. 

jagitial police infected with corona

కరీంనగర్: జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం సృష్టించింది. ఈ ఠాణాలో పనిచేసే ఓ పోలీస్‌ కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడినే కాదు స్టేషన్లో పనిచేసే పోలీస్ సిబ్బంది మొత్తాన్ని హోం క్వారంటైన్ చేశారు. దీంతో పోలీస్  స్టేషన్లో శానిటైజ్ చేసి రాత్రిపూట మూసివేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.  

వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసే ఓ పోలీస్ అధికారి కరోనా బారిన పడ్డాడు. అతడికి కరోనా లక్షణాలుండటంతో పరీక్షల నిమిత్తం 
రక్తనమూనాలను వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలకు పంపించారు. అయితే బుధవారం ఆ రిపోర్టులు రాగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

దీంతో ఆయన కుటుంబం జగిత్యాల జిల్లా కేంద్రంలో నివాసం ఉండటంతో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ పుప్పాల శ్రీధర్‌ రాత్రి ఆయన ఇంటికి వెళ్లారు. ఇంట్లో అన్ని సదుపాయాలు ఉండటంతో హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందేందుకు అనుమతించారు. అతడు కూడా ఇందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు. అయితే భార్య, పిల్లలను గురువారం వైద్య పరీక్షలు నిర్వహించి వారి పుట్టింటికి పంపించాలని భావిస్తున్నారు. 

read more   తెలంగాణలో 17 వేలు దాటిన కేసులు: ఒక్క రోజులో 1,018 మందికి పాజిటివ్... ఏడుగురు మృతి

ఈ క్రమంలోనే అతడితో కలిసి విధులు నిర్వహించిన 12 మంది పోలీస్ సిబ్బందిని కూడా హోం క్వారెంటైన్‌కు పంపించారు. వారందరి రక్తనమూనాలు గురువారం వరంగల్‌ పంపించనున్నారు. 

విషయం తెలిసిన వెంటనే జిల్లా అదనపు ఎస్పీ కె. దక్షిణామూర్తి, జగిత్యాల డీఎస్పీ పి.వెంకటరమణ గొల్లపల్లి పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఠాణాను రాత్రి మూసి ఉంచాల్సిందిగా ఆదేశించారు. గురువారం శానిటైజేషన్‌ చేసి ఇన్‌ఛార్జిగా ఉండాలని బుగ్గారం ఎస్‌.ఐ. చిరంజీవిని ఆదేశించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios