కరీంనగర్‌లొ ప్రముఖ సినీనటి, జబర్దస్త్ యాంకర్ రేష్మీ గౌతమ్ సందడి చేశారు. నగరంలోని శివ థియేటర్‌లో ఏర్పాటు చేసిన గ్రీన్ ట్రెండ్స్ స్టైల్ సెలూన్‌ను ఆమె బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా రేష్మీ మాట్లాడుతూ.. కరీంనగర్ అంటే తనకు చాలా ఇష్టమని, చాలా రోజుల తర్వాత మళ్లీ ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ట్రెండ్స్ బ్యూటీ సెలూన్‌లో మహిళలను, పురుషులను అందంగా తీర్చిదిద్దేలా కొత్త టెక్నాలజీతో రూపొందించిన సౌకర్యాలు ఉన్నాయన్నారు.

తను ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ...తనకు గుర్తింపును తీసుకొచ్చిన జబర్దస్త్‌కు ఎంతో రుణపడి ఉంటానని వెల్లడించారు. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు టీవీ షోలలో నటిస్తూ బిజీగా ఉన్నానని రేష్మీ పేర్కొన్నారు. 

సంబంధిత వీడియో 

అన్నీ చెప్పేయమంటారా: మీడియాకు రేష్మి క్వొశ్చన్ (వీడియో)...