ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో జోష్... సొంతగూటికి చేరిన సీనియర్ లీడర్

దివంగత కాంగ్రెస్ లీడర్ జి వెంకటస్వామి కుమారుడు జి వినోద్ మళ్లీ సొంతగూటికే చేరుకున్నారు.  

gaddam vinod joins congress in presence of kuntia

కరీంనగర్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ముందు ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులకు మంచి జోష్ ఇచ్చే పరిణామం చోటుచేసుకుంది. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన గడ్డం వినోద్ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.  తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఆర్సీ కుంతియా, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమక్షంలో ఆయన శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 

దివంగత కాంగ్రెస్ నేత జి. వెంకటస్వామి తనయుడైన వినోద్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కి గుడ్ బై చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ తరపున చెన్నూరు నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డ అతడు చివరకు ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత అతడు ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా వుంటూ వస్తున్నారు. 

read more  కేటీఆర్ అందుకోసమే పనికిరాలేడు... సీఎంగా ఎలా...: మాజీ ఎంపీ సంచలనం

 దసరాకు ముందే వినోద్ కాంగ్రెసులో చేరుతారనే ప్రచారం జరుగింది. భైంసాలో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెసులో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది. కారణాలేమైనా ఆయన  అప్పుడు కాంగ్రెస్ లో చేరలేకపోయారు. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ లో చేరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారనే చెప్పాలి. 

ఇక టీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసిన మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆయన సోదరుడు వివేక్ కూడా కాంగ్రెసులో పార్టీలో చేరుతారని ప్రచారం జరిగినా ఇప్పటికే ఆయన బిజెపిలో చేరారు. దీంతో ఎప్పుడూ ఒకే పార్టీలో కొనసాగిన అన్నదమ్ములిద్దరు ఇప్పుడు వేరువేరు పార్టీల్లో పనిచేయడానికి సిద్దమయ్యారు. 

గతంలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వినోద్ చెన్నూరు శాసనసభ నియోజకవర్గానికి, వివేక్ పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి కాంగ్రెసు తరఫున పోటీ చేసి ఓడిపోయారు.  తర్వాత 2016లో అధికార టిఆర్ఎస్ లో చేరారు. ఈ నేపథ్యంలో వివేక్ కు ప్రభుత్వ సలహాదారు పదవి లభించింది. అయితే 2019 ఎన్నికల్లో చెన్నూరు టికెట్ ను వినోద్ ఆశించారు. కానీ కేసిఆర్ మరోలా భావించి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కు చెన్నూరు టికెట్ కేటాయించారు. దాంతో వినోద్ లో అసంతృప్తి చోటు చేసుకుంది. చివరకు ఇండిపెండెంట్ గా పోటీచేసిన వినోద్ ఓటమిపాలయ్యారు. 
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios