కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని అలుగునూరు బ్రిడ్జిపై నుండి ప్రమాదశాత్తు పడిపోయిన కానిస్టేబుల్ చంద్రశేఖర్  మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  ఆయన మృత్యువాత పడ్డారు. అలుగునూరు బ్రిడ్జి పై నుండి కారు పడిన  కారును వెలికితీస్తున్న సమయంలో కానిస్టేబుల్ పడిపోయిన విషయం తెలిసిందే. 

కరీంనగర్ పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన జెండి శ్రీనివాస్ తన భార్యతో కలిసి కొమురవెళ్లి మల్లన్నను దర్శించుకొనేందుకు వెళ్తున్న సమయంలో అలుగునూరు బ్రిడ్జి నుండి కారు కిందపడింది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్యతో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Also read:కరీంనగర్‌‌లో బ్రిడ్జిపై నుండి కారు బోల్తా: ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

ఈ విషయం తెలిసిన తర్వాత కరీంనగర్ పట్టణంలోని బ్లూకోట్‌కు  చెందిన కానిస్టేబుల్ చంద్రశేఖర్  సంఘటన స్థలానికి చేరుకొన్నారు. అప్పటికే  బ్రిడ్జిపై నుండి కిందపడిన కారును వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

also read:విషాదం: తల్లి అంత్యక్రియలకు వెళ్తూ కొడుకు, కోడలు మృతి

బ్రిడ్జిపై నుండి కానిస్టేబుల్ చంద్రశేఖర్ చూస్తున్నాడు. ప్రమాదశాత్తు కానిస్టేబుల్ చంద్రశేఖర్ జారి కిందపడిపోయాడు. బ్రిడ్జిపై నుండి నేరుగా రాళ్లపై పడ్డాడు.దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ చంద్రశేఖర్ మృతి చెందాడు.