TSPSC FSO రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్‌ను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్ లో విడుదల చేిసంది.  అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారం ప్రకారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీస్ & ఫుడ్ (హెల్త్) అడ్మినిస్ట్రేషన్‌లో 24 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, వేతనం, వయోపరిమితి కింద ఉన్నాయి. 

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రాష్ట్రంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీస్ & ఫుడ్ (హెల్త్) అడ్మినిస్ట్రేషన్‌లో 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది.

ఆసక్తి గల అభ్యర్థులు 26 ఆగస్టు 2022 తేదీ లోగా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 29 జూలై 2022 నుండి ప్రారంభమవుతుంది. ఈ పోస్ట్‌లకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ. రూ. 42,300- రూ.1,15,270 గా నిర్ణయించారు. 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఫుడ్ టెక్నాలజీ లేదా డైరీ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా ఆయిల్ టెక్నాలజీ లేదా అగ్రికల్చరల్ సైన్స్ లేదా వెటర్నరీ సైన్సెస్‌లో డిగ్రీ లేదా అదనపు అర్హతను కలిగి ఉండాలి.

నోటిఫికేషన్ వివరాలు 
నోటిఫికేషన్ నంబర్: 06/2022

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ముఖ్యమైన తేదీలు 
దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ: 29 జూలై 2022
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 26 ఆగస్టు 2022

ఖాళీల వివరాలు 
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్-24

విద్యా అర్హత: 
A) ఫుడ్ టెక్నాలజీ లేదా డైరీ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా ఆయిల్ టెక్నాలజీ లేదా అగ్రికల్చరల్ సైన్స్ లేదా వెటర్నరీ సైన్సెస్ లేదా బయో-కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీలో డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ లేదా మెడిసిన్‌లో డిగ్రీ; లేదా
B) కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఏదైనా ఇతర సమానమైన / గుర్తింపు పొందిన అర్హత.

వయోపరిమితి..
21- 44 సంవత్సరాలు.