Asianet News TeluguAsianet News Telugu

Supreme Court recruitment: డిగ్రీతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే..?

డిగ్రీతో సుప్రీంకోర్టులో ఉద్యోగం పొందొచ్చు. జూనియర్​ కోర్టు అసిస్టెంట్​ పోస్టులకు సుప్రీం కోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.
 

Supreme Court recruitment 2022
Author
Hyderabad, First Published Jun 19, 2022, 4:36 PM IST

దేశ అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసేందుకు మంచి అవకాశం ఇది. డిగ్రీతో సుప్రీం కోర్టులో ఉద్యోగాలు ఉన్నాయి. నెలకు రూ.63 వేల వేతనంతో ఉద్యోగం సాధించొచ్చు. పోస్టులు, దరఖాస్తు విధానం తెలుసుకోండి. జూనియర్​ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్​ బీ నాన్​ గెజిటెడ్​) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 210 ఉద్యోగాలు ఉన్నాయి. బేసిక్​ పే నెలకు రూ.35,400గా ఉండగా అన్ని అలవెన్సులు కలిపి మొత్తంగా రూ.63,068 వరకు వస్తుంది.

ఈ పోస్టులకు అప్లై చేసేవారు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. కంప్యూటర్​పై నిమిషానికి 35 ఆంగ్లం పదాలు టైపింగ్​ చేసే సామర్థ్యం ఉండాలి. .కంప్యూటర్​పై అవగాహన ఉండాలి. అభ్యర్థులు 2022 జులై 1 నాటికి 18 ఏళ్లు పైబడి 30 ఏళ్ల వయసులోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్​సర్వీస్​మెన్​, స్వాతంత్య్ర సమరయోధులపై ఆధారపడే వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంది. సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో పని చేస్తున్న అభ్యర్థులకు గరిష్ఠ వయో పరిమితి లేదు. ఇతర ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న వారికి ఎలాంటి సడలింపులు లేవు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.

అభ్యర్థులు సుప్రీం కోర్టు వెబ్​సైట్ కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులు 2022, జూన్​ 18 నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. జనరల్​, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం కింద రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్​సర్వీస్​మెన్​, దివ్యాంగులు రూ.250 పే చేయాలి. యూకో బ్యాంకు గేట్​వే ద్వారా రుసుం చెల్లించాలి. దరఖాస్తు చివరి జులై 10 2022 నిర్ణయించారు. 100 ప్రశ్నలతో ఆబ్జెక్టివ్​ తరహా రాత​ పరీక్ష నిర్వహిస్తారు. 50 జనరల్​ ఇంగ్లీష్​ ప్రశ్నలు, 25 జనరల్​ ఆప్టిట్యూడ్​, 25 జనరల్​ నాలెడ్జ్​ ప్రశ్నలు ఉంటాయి. 25 ప్రశ్నలతో కంప్యూటర్​ పరిజ్ఞానంపై ఆబ్జెక్టివ్​ పరీక్ష ఉంటుంది. మొత్తం 2 గంటల సమయం ఉంటుంది. ఇందులో తప్పు సమాధానానికి 1/4 మార్కులు నెగెటివి మార్క్ ఉంటుంది.

కంప్యూటర్​పై నిమిషానికి 35 పదాలు తప్పులు లేకుండా టైప్​ చేయాలి . 10 నిమిషాల సమయం ఇస్తారు. ఆబ్జెక్టివ్​ టైప్​ పరీక్ష రోజే ఈ టైపింగ్​ పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లీష్​లో వ్యాసరూప పరీక్ష పెడతారు. 2 గంటల సమయం ఇస్తారు. రాత పరీక్ష, కంప్యూటర్​ టెస్ట్​, టైపింగ్​, డిస్క్రిప్టివ్​ టెస్ట్​ల్లో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూలకు ఎంపిక ఉంటుంది. మంచి మార్కులు సాధిస్తే.. జూనియర్​ కోర్టు అసిస్టెంట్​లుగా సెలక్ట్ చేస్తారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios