తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఉన్న  సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌సి‌ఎల్ ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం  372 నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులని భర్తీ చేయనుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది  ఫిబ్రవరి 27.  ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://scclmines.com/ లో  చూడవచ్చు.

గమనిక: జూనియర్‌ స్టాఫ్ నర్సు పోస్టులకు మహిళా అభ్యర్థులతో పాటు పురుషులు కూడా  ధరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా సింగరేణి సంస్థ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య : 372
ఫిట్టర్- 128, ఎలక్ట్రీషియన్- 51, వెల్డర్- 54, టర్నర్ లేదా మెషినిస్ట్ ట్రైనీ- 22, మోటార్ మెకానిక్ ట్రైనీ- 14, ఫౌండర్ మెన్ - 19, జూనియర్ స్టాఫ్ నర్స్- 84

విద్యార్హతలు: పోస్టులను బట్టి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి లేదా బీఎస్‌సీ నర్సింగ్ లో ఉత్తీర్ణులై ఉండాలి.  

also read ఆర్మీ ఎగ్జామ్ పేపర్​ లీక్​.. దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు, పుణేలో కుట్ర ... x

వయసు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టి, ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్  ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ. 200

దరఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేది: 27 ఫిబ్రవరి 2021

అధికారిక వెబ్‌సైట్‌:https://scclmines.com/