స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందుకు అర్హత, ఆసక్తి, అనుభవం గల అభ్యర్థుల నుండి  దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్‌ అయిన భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందుకు అర్హత, ఆసక్తి, అనుభవం గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌ ద్వారా స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులు మొదట ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది. మరింత సమాచారం లేదా పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://bank.sbi/careers చూడవచ్చు.

నోటిఫికేషన్‌ వివరాలు 

పోస్టుల పేరు: మేనేజర్‌ (రిటైల్‌ ప్రొడక్ట్స్‌)

అర్హత: ఎంబీఏ లేదా పీజీడీఎం/ బీఈ / బీటెక్‌ పూర్తి చేసి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: దరఖాస్తు చేసుకున్న వారి విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి అభ్యర్థులను ఎంపికలు ఉంటాయి. ఎంపికైన వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.750 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజులేదు.

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 12

వయస్సు: 25 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి 

అధికారిక వెబ్‌సైట్‌:https://bank.sbi/careers

జీతం : రూ.78,230 

మొత్తం ఖాళీ పోస్టులు-5

పోస్టుల కేటాయింపు: జనరల్-4, ఓ‌బి‌సి-1, 

ధరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్ధులు అర్హత వివరాలు పూర్తిగా చదవాల్సి ఉంటుంది.