బ్యాంక్ జాబ్స్: నేటి నుంచి SBI Clerk పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం. హైదరాబాద్ సర్కిల్ లో 225 పోస్టుల భర్తీ..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్లర్క్ రిక్రూట్‌మెంట్లో భాగంగా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియ, ఈరోజు అంటే సెప్టెంబర్ 7 నుండి ప్రారంభమైంది.
బ్యాంకు ఉద్యోగమే మీ లక్ష్యమా..అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో గోల్డెన్ ఛాన్స్ మీ కోసం ఎదురు చూస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది శుభవార్త. SBI క్లర్క్ (SBI Clerk Notification 2022) ఖాళీల కోసం దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైంది. SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2022 (SBI Clerk Notification 2022) నోటిఫికేషన్ ప్రకారం, క్లరికల్ కేడర్‌లో 5000 కంటే ఎక్కువ జూనియర్ అసోసియేట్ పోస్టుల కోసం ఖాళీ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 7, 2022 నుండి ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 27, 2022. అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్, sbi.co.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇందులో హైదరాబాద్ సర్కిల్ లోనే దాదాపు 225 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
SBI క్లర్క్ ఖాళీ 2022 ముఖ్యమైన తేదీలు (SBI Clerk Vacancy 2022 Important Date)
నోటిఫికేషన్ - 6 సెప్టెంబర్. 2022
దరఖాస్తు ప్రారంభ తేదీ- సెప్టెంబర్ 7, 2022
దరఖాస్తులకు చివరి తేదీ - సెప్టెంబర్ 27, 2022
SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ పరీక్ష తేదీ – నవంబర్ 2022
పరీక్ష అడ్మిట్ కార్డ్ - అక్టోబర్ 29, 2022
ప్రధాన పరీక్ష - డిసెంబర్, 2022 లేదా జనవరి, 2023
SBI క్లర్క్ ఖాళీ 2022 ఖాళీల వివరాలు (SBI Clerk Vacancy 2022 Vacancy Details)
SBI నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 5008 పోస్టులను భర్తీ చేయనున్నారు. అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, బెంగాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, కేరళ, లక్నో, ఢిల్లీ, మహారాష్ట్ర, ముంబై మెట్రో, మహారాష్ట్ర మరియు ఈశాన్య శాఖలకు ఈ రిక్రూట్‌మెంట్ జరగనుంది. లక్నో, భోపాల్ తర్వాత మహారాష్ట్రలో గరిష్ట ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్ సర్కిల్ 225 పోస్టులను భర్తీ చేయనున్నారు.
SBI క్లర్క్ ఖాళీ 2022 ఎంపిక ప్రక్రియ (SBI Clerk Vacancy 2022 Selection Process)
ఆన్ లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్),
ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్ష రూపంలో మొత్తం రెండు దశల్లో నిర్వహిస్తారు.
ప్రిలిమినరీలో ఆబ్జెక్టివ్ పద్ధతిలో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఇక మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
ఇంటర్వ్యూ
SBI క్లర్క్ ఖాళీ 2022 అర్హత, వయో పరిమితి (SBI Clerk Vacancy 2022 Qualification, Age Limit)
విద్యార్హతలు: ఏదైనా గ్రాడ్యుయేషన్ / డిగ్రీ పాస్ అయి ఉండాలి (డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు). గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉన్న అభ్యర్థులు మాత్రమే SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 30 నవంబర్ 2022లోపు డిగ్రీ చెల్లుబాటు అవుతుంది. చివరి సంవత్సరం లేదా సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు కనీసం 20 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ నుండి వచ్చే అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఇవ్వబడుతుంది.