రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2021 విడుదల చేసింది.  ఈ నోటిఫికేషన్ లో భాగంగా  ఖాళీగా ఉన్న 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయడానికి  ఆర్‌బిఐ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.  ఈ మొత్తం పోస్టుల్లో 57 పోస్టులు హైదరాబాద్‌ కేంద్రంలోనూ ఖాళీ ఉన్నాయి.

దరఖాస్తు ఫార్మ్ ను ఆర్‌బిఐ  అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పోస్టులకు ఫిబ్రవరి 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై మార్చి 15 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.rbi.org.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

 అర్హత
ఆర్‌బిఐ  నోటిఫికేషన్‌ ప్రకారం దరఖాస్తు చేసుకునే  అభ్యర్థులు 1/02/2021 లోపు అండర్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.  ఆన్‌లైన్ పరీక్ష తర్వాత అభ్యర్థులు లాంగ్వేజ్ ప్రోఫిషెన్సి టెస్ట్ (ఎల్‌పిటి) కు హాజరుకావాల్సి ఉంటుంది. ఎల్‌పిటిలో  అభ్యర్ధులకు  ఎలాంటి మినహాయింపు ఇవ్వబడదు.  గ్రాడ్యుయేట్లు, ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

వయసు: 1 ఫిబ్రవరి 2021 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎంపిక
 ఆన్‌లైన్ పరీక్ష, ఎల్‌పిటిలో అర్హత, మెడికల్ ఫిట్‌నెస్, సర్టిఫికెట్ల ధృవీకరణ, బయోమెట్రిక్ డేటా / ఐడెంటిటీ వెరిఫికేషన్ మొదలైన వాటి ద్వారా తుది ఎంపికలు ఉంటాయి.
 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో  మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ పరీక్ష ప్రారంభానికి ముందు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, పిడబ్ల్యుబిడి వర్గాలకు చెందిన  అభ్యర్థులకు ప్రీ-టెస్ట్ శిక్షణను బ్యాంక్ అందిస్తుంది. 

ఈ వర్గాలకు చెందిన అభ్యర్థులు శిక్షణ పొందాలనుకునే వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ప్రాంతీయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/జనరల్‌ అభ్యర్థులు రూ.450, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.50 చెల్లించాలి.

పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 9, 10  తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.