రైల్వేలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..
చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వే 32 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు పంపించాల్సి ఉంటుంది.
చెన్నైలోని సౌత్ రైల్వేలో ఒప్పంద పతిప్రాదికన ఉద్యోగ నియమకాలు జరుగుతున్నాయి. చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వే 32 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నా అభ్యర్థులను మొదట షార్ట్‌లిస్టింగ్ చేసిన తరువాత ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తులు పంపించే ప్రక్రియ ప్రారంభమయ్యాయి. 06 అక్టోబర్ 2020 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. అభ్యర్థులు మరింత పూర్తి సమాచారం https://sr.indianrailways.gov.in/ వెబ్‌సైట్ లో చూసుకోవచ్చు.
సౌత్ రైల్వేలో ఉన్న మొత్తం ఖాళీలు: 32
ఇంటెన్సివిస్ట్-08
డయాగ్నస్టిక్ రేడియాలజిస్ట్-04
ఫిజీషియన్-06
జీడీఎంఓ-14
అభ్యర్ధుల అర్హత: పోస్టును బట్టి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ డీఎన్‌బీలో ఉత్తీర్ణత, అలాగే అనుభవం ఉండాలి.
ఎంపిక చేసే విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ధరఖస్తు పంపించాల్సిన ఈ-మెయిల్: covid19cmp20@gmail.com
దరఖాస్తు చివరి తేది: 06 అక్టోబర్ 2020
అధిక సమాచారం కోసం వెబ్‌సైట్:https://sr.indianrailways.gov.in/ లో చూడవచ్చు.