Indian Railways: రైల్వేలో 2,65,000లకు పైగా ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
భారత రైల్వే విభాగంలో దాదాపు 2, 65,000లకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది.
భారత రైల్వే విభాగంలో దాదాపు 2, 65,000లకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మొత్తం 2,65,547 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిల్లో2,177 గెజిటెడ్ పోస్టులుకాగా, 2,63,370 నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ ఏడాది వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఆయా ఖాళీలను పూరించనున్నట్లు మంత్రి తన ప్రసంగంలో తెలిపారు.
మొత్తం 2,177 గెజిటెడ్ పోస్టుల్లో విభాగాల వారీగా ఖాళీల వివరాలు
సెంట్రల్ రైల్వేలో- 56
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో- 87
ఈస్టర్న్ రైల్వేలో- 195
ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో- 170
మెట్రో రైల్వేలో- 22
నార్త్ సెంట్రల్ రైల్వేలో- 141
నార్త్ ఈస్టర్న్ రైల్వేలో- 62
నార్త్ ఈస్ట్ ఫ్రంటీర్ రైల్వేలో- 112
నార్తెర్న్ రైల్వేలో- 115
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో- 100
సౌత్ సెంట్రల్ రైల్వేలో- 43
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో- 88
సౌత్ ఈస్టర్న్ రైల్వేలో- 137
సౌతర్న్ రైల్వేలో- 65
వెస్ట్ సెంట్రల్ రైల్వేలో- 59
వెస్ట్రన్ రైల్వేలో- 172
ఇతర రైల్వే విభాగాల్లో- 507 గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మొత్తం 2,63,370 నాన్ గెజిటెడ్ పోస్టుల్లో విభాగాల వారిగా ఖాళీల వివరాలు చూస్తే
సెంట్రల్ రైల్వేలో- 27,177
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో- 8,447
ఈస్టర్న్ రైల్వేలో- 28,204
ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో- 15,268
మెట్రో రైల్వేలో- 856
నార్త్ సెంట్రల్ రైల్వేలో- 9,366
నార్త్ ఈస్టర్న్ రైల్వేలో- 14,231
నార్త్ ఈస్ట్ ఫ్రంటీర్ రైల్వేలో- 15,477
నార్తెర్న్ రైల్వేలో- 37,436
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో- 15,049
సౌత్ సెంట్రల్ రైల్వేలో- 16,741
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో- 9,422
సౌత్ ఈస్టర్న్ రైల్వేలో- 16,847
సౌత్ ఇండియన్ రైల్వేలో- 9,500
సౌత్ వెస్ట్రన్ రైల్వేలో- 6,525
వెస్ట్ సెంట్రల్ రైల్వేలో- 11,073
వెస్ట్రన్ రైల్వేలో- 26,227
ఇతర విభాగాల్లో- 11,073 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ పోస్టులన్నింటినీ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా వివిధ సెషన్లలో భర్తీ చేస్తామని రైల్వే మినిస్టర్ తెలిపారు. కాగా గత నెల్లో వివిధ విభాగాల్లోని దాదాపు 35,281 రైల్వే నియామకాలను రద్దుచేసినట్లు మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.