NMDC recruitment 2022: జూనియర్ ఆఫీసర్ పోస్టుల కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఎన్‌ఎం‌డి‌సి జే‌ఓ‌టి రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. 12 ఫిబ్రవరి నుండి 18 ఫిబ్రవరి 2022 నాటి ఉపాధి వార్తాపత్రికలో ఇంకా nmdc.co.in అధికారిక వెబ్‌సైట్‌లో జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (JOT) పోస్టులకు రిక్రూట్‌మెంట్  నోటిఫికేషన్‌ను ప్రచురించింది.  అర్హత, ఆసక్తిగల ఇంజనీర్లు ఎన్‌ఎం‌డి‌సి రిక్రూట్‌మెంట్ కోసం 27 ఫిబ్రవరి 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 

NDMC JOT Recruitment 2022: Apply Online for 94 Junior Officer Trainee Post nmdc.co.in

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు  చక్కటి అవకాశం. ప్రభుత్వ రంగ  కంపెనీలలో ఒకటైన ఎన్‌ఎం‌డి‌సి  (NMDC) అంటే నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్  రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించింది. ఎన్‌ఎం‌డి‌సి లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ nmdc.co.inలో ఈ ప్రకటనను జారీ చేయడం ద్వారా  జే‌ఓ‌టి అంటే జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (JOT) ఉద్యోగానికి రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను ప్రచురించింది.

ఆసక్తి ఉన్న ఇంజనీర్లు ఎన్‌ఎం‌డి‌సి రిక్రూట్‌మెంట్ కోసం 27 ఫిబ్రవరి 2022లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌ఎం‌డి‌సి రిక్రూట్‌మెంట్ 2022 కింద సివిల్, మెకానికల్, మైనింగ్, G&QC అండ్ సర్వే మొదలైన వాటితో మొత్తం 94 ఖాళీలు ఉన్నాయి. అయితే దరఖాస్తుదారుల వయస్సు 32 ఏళ్లు మించకూడదు. దరఖాస్తుదారులను రాత పరీక్ష ఇంకా స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.250/-. అయితే SC/ ST/ PWBD/ ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు.


 
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ - 07 ఫిబ్రవరి, 2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 27 ఫిబ్రవరి, 2022
 
 పే స్కేల్
నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డిగ్రీ హోల్డర్లకు మొదటి 18 నెలలు నెలకు రూ. 37,000/- జీతం లభిస్తుంది. అలాగే డిప్లొమా హోల్డర్లు మొదటి 12 నెలలకు రూ. 37,000/- తరువాత ఆరు నెలలకు నెలకు రూ. 38,000/- వరకు పొందుతారు. అయితే, రెండు కేటగిరీల అభ్యర్థులకు శిక్షణ పూర్తయిన తర్వాత పే స్కేల్ రూ.37,000/- నుండి 1,30,000/-  వరకు ఉంటుంది.
 
 ఖాళీల వివరాలు
జూనియర్ ఆఫీసర్ (మెకానికల్) ట్రైనీ - 33
జూనియర్ ఆఫీసర్ (మైనింగ్) ట్రైనీ - 32
జూనియర్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్) ట్రైనీ - 14
జూనియర్ ఆఫీసర్ (సివిల్) ట్రైనీ - 07
జూనియర్ ఆఫీసర్ (G&QC) ట్రైనీ - 07
జూనియర్ ఆఫీసర్ (సర్వే) ట్రైనీ - 01
మొత్తం పోస్ట్‌లు - 94

 అర్హతలు
జూనియర్ ఆఫీసర్ ట్రైనీ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ. డిప్లొమా హోల్డర్లకు మాత్రమే కనీసం ఐదేళ్ల  అర్హత అనుభవం అవసరం.
జూనియర్ ఆఫీసర్ (G&QC) ట్రైనీ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి జియోసైన్సెస్/అప్లైడ్ జియాలజీ/ఎక్స్‌ప్లోరేషన్ జియాలజీలో MSc/MTech ఇంకా ఒక సంవత్సరం  క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
జూనియర్ ఆఫీసర్ (సర్వే) ట్రైనీ : మైనింగ్‌లో మూడేళ్ల డిప్లొమా, మైన్స్ & మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా, MMR కింద  మైన్ సర్వేయర్ సర్టిఫికేట్ ఇంకా ఐదేళ్ల  అనుభవం ఉండాలి. 

 ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు ముందుగా ఎన్‌ఎం‌డి‌సి అధికారిక వెబ్‌సైట్ nmdc.co.inని సందర్శించండి.
ఇప్పుడు ఎన్‌ఎం‌డి‌సి వెబ్‌సైట్‌లోని కెరీర్‌ల విభాగానికి వెళ్లండి. 
ఎన్‌ఎం‌డి‌సి జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (JOT) రిక్రూట్‌మెంట్‌పై  క్లిక్ చేయండి.
పూర్తి నోటిఫికేషన్ ప్రకటనను చదవండి & డౌన్‌లోడ్ చేయండి.
అప్లయ్ ఆన్‌లైన్‌ బటన్‌పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. 
మీరు మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ని SMS/ఇ-మెయిల్ ద్వారా అందుకుంటారు. 
ఆ తర్వాత మీ ఫారమ్ సబ్మిట్  చేయడానికి దరఖాస్తుదారు లాగిన్ బటన్‌పై క్లిక్ చేయండి.
అన్ని సంబంధిత డాక్యుమెంట్స్,  సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయండి.
పేమెంట్ గేట్‌వే లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజ్ చెల్లించండి.
ఇప్పుడు దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్, చెల్లింపు స్లిప్‌ డౌన్‌లోడ్ చేసుకోండి.
భవిష్యత్ అవసరాల కోసం మీరు దాని ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios