నీట్ పరీక్ష ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్కులు రావాలి, కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఫుర్తి సమాచారం ఇదే..
ఈసారి నీట్ పరీక్షలో పోటీ ఎక్కువగానే ఉండవచ్చు. ఎందుకంటే 18 లక్షల 72 వేల 341 మంది అభ్యర్థులు అన్నీ మెడికల్ యూనివర్సిటీలు, కాలేజీలో ప్రవేశం పొందడానికి పరీక్షకు హాజరు కానున్నారు. అయితే ఈసారి కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ అంటే NEET పరీక్ష (NEET UG test 2022) జూలై 17న జరగనుంది. ఇందుకోసం ఈసారి 18 లక్షల 72 వేల 341 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందువల్ల పోటీ చాలా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. డాక్టర్ కావాలని కలలు కంటున్న విద్యార్థులు వారి ప్రిపరేషన్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ఏదైనా చిన్న పొరపాటు కూడా వారి కలలను నాశనం చేయవచ్చు. కాబట్టి పరీక్షకు ముందు విద్యార్ధులు ఈ పరీక్షకు సంబంధించిన పరీక్షా ప్యాటర్న్, మార్కులు, కట్ ఆఫ్ వంటి ప్రతి సమాచారం గురించి అప్ డేట్ గా ఉండాలి..
NEET UG పరీక్ష 2022 ప్యాటర్న్
NEET పరీక్ష ప్యాటర్న్ 2022 ప్రకారం పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల నుండి 200 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో విద్యార్థులు 180 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలి. అంటే మొత్తం నాలుగు సబ్జెక్టుల్లో 50-50 ప్రశ్నలు ఉంటే 45-45 మాత్రమే సమాధానం చెయ్యాలి. నీట్ ప్రశ్నపత్రంలో రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి A అండ్ B... సెక్షన్ Aలో 35 ప్రశ్నలు, సెక్షన్ Bలో 15 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ Bలోని ఈ 15 ప్రశ్నల్లో అభ్యర్థులు 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలి.
NEET UG పరీక్ష 2022లో నెగిటివ్ మార్కింగ్
NEET UG పరీక్ష 2022లో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అంటే ప్రతి కరెక్ట్ సమాధానానికి అభ్యర్థికి నాలుగు మార్కులు ఇస్తారు, ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కట్ చేస్తారు. ఒకవేళ విద్యార్థి ఏదైనా ప్రశ్నకు సమాధానం చేయకుండ వొదిలేస్తే అప్పుడు మార్కు కట్ చేయడం ఉండదు.
NEET UG పరీక్ష 2022 ఏ భాషలలో ఉంటుంది
ఇంగ్లీష్ కాకుండా NEET పరీక్ష హిందీ, బెంగాలీ, గుజరాతీ, అస్సామీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి 12 భారతీయ భాషలలో నిర్వహిస్తారు. మీరు ఏదైనా రాష్ట్రం నుండి పరీక్ష రాస్తున్నట్లయితే మాత్రమే మీరు స్థానిక భాషను అంటే ప్రాంతీయ భాషను ఎంచుకోవచ్చు. అంటే మీరు తమిళ భాష నుండి పరీక్ష రాయలనుకుంటే మీరు తమిళనాడులోనే పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవాలి.
నీట్ పరీక్ష మార్కులు, కట్ ఆఫ్ మార్కులు
నీట్ పరీక్ష పేపర్ మొత్తం 720 మార్కులు. 200 ప్రశ్నలలో 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి, అంటే 180 ప్రశ్నలకు మొత్తం 720 ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు కట్ ఆఫ్ గురించి మాట్లాడితే ప్రతి సంవత్సరం కట్ ఆఫ్ మార్క్స్ పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ సాధారణ అభ్యర్థులు మొత్తం 720 మార్కులకు కనీసం 550-600 మార్కులు సాధించి టాప్ ర్యాంక్ తో ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, మంచి వైద్య కళాశాలలో ప్రవేశానికి OBC విద్యార్థులు 500-600 మార్కులు సాధించాలి, SC/ST కేటగిరీ విద్యార్థులు 450 కంటే ఎక్కువ మార్కులు సాధించాలి.