Asianet News TeluguAsianet News Telugu

జస్ట్ 10th పాస్ అయితే చాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం, డిసెంబర్ 22 లాస్ట్ డేట్ లోగా అప్లై చేసుకోండి..

ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్‌లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.  ఈ భర్తీ ద్వారా మొత్తం 287 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు వెబ్‌సైట్‌లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోండి. ఈ ఖాళీల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Just passing 10th is enough, Central Govt job opportunity, apply before December 22nd last date
Author
First Published Dec 5, 2022, 1:32 AM IST

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది ఉత్తమ అవకాశం, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ పోస్టుల కోసం ఖాళీలను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 23 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 22. ఆసక్తి గల అభ్యర్థులు recruitment.itbpolice.nic.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ITBP రిక్రూట్‌మెంట్ 2022 ఖాళీల వివరాలు-
మొత్తం పోస్టులు – 287

కానిస్టేబుల్ టేలర్ - 18 పోస్టులు

కానిస్టేబుల్ గార్డనర్ - 16 పోస్టులు

కానిస్టేబుల్ కాబ్లర్ - 31 పోస్టులు

కానిస్టేబుల్ సఫాయి కరంచారిలు - 78 పోస్టులు

కానిస్టేబుల్ వాషర్‌మెన్ - 89 పోస్టులు

కానిస్టేబుల్ బార్బర్ - 55 పోస్టులు

గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కానిస్టేబుల్ టైలర్ , గార్డనర్  కాబ్లర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ డిప్లొమా ఉన్నవారు కూడా. అదేవిధంగా 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే కానిస్టేబుల్ సఫాయి కరంచారీస్, వాషర్‌మెన్ మరియు బార్బర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ITBP రిక్రూట్‌మెంట్ 2022 వయో పరిమితి-
కానిస్టేబుల్ (టైలర్, మాలి & కాబ్లర్) అభ్యర్థుల వయస్సు 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. కానిస్టేబుల్ (సఫాయి కరంచారి, ధోబీ & బార్బర్) పోస్టుకు వయోపరిమితి 18 నుండి 25 సంవత్సరాలు ఉండాలి.

ITBP రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు రుసుము-
UR/ OBC/ EWS వర్గాలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 100, SC/ST/మహిళలు, మాజీ సైనికులకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios