ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో భారీగా ఉద్యోగాలు.. వెంటనే అప్లయి చేసుకోండీ..
ఐఓసిఎల్ తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 885 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉన్నాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్) తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 885 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులు టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని తాత్కాలిక ప్రాతిపదికన, మరికొన్నింటిని పర్మినెంట్ విభాగంలో భర్తీ చేస్తారు. పూర్తి వివరాల కోసం https://iocl.com/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
1. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్-16 ఖాళీలు
కెమికల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల పాటు డిప్లొమా, రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ లేదా మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో బీఎస్‌సి చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది ఫిబ్రవరి 19.
యూఆర్-9, ఈడబల్యూఎస్-1, ఎస్‌సి-2, ఓబిసి-4 పోస్టులు కేటాయించారు.
అబ్బాయిలు మాత్రమే ధరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయస్సు: 18 నుండి 25 వరకు అర్హులు. ఎస్‌సి- ఎస్‌టి-ఓబిసి వారికి వయో సడలింపు వర్తిస్తుంది.
వ్రాత పరీక్ష, స్కిల్/ ఫిజికల్ టెస్ట్, మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
మరింత సమాచారం కోసం : 06243-275259/ 06243-275266 సంప్రదించవచ్చు.
also read ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ అర్హత ఉన్నవారు వెంటనే అప్లయి చేసుకోండీ.. ...
2. టెక్నీకల్, నాన్ టెక్నికల్ అప్రెంటీస్- 869 ఖాళీలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఐటీఐలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానిక్, మెషినిస్ట్ తదితర విభాగాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాల్లో డిప్లొమా చేసిన వారికి కొన్ని పోస్టులు, ఇంటర్ పూర్తి చేసి డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో స్కిల్ సర్టిఫికెట్ పొంది ఉన్న వారి కోసం మరికొన్ని పోస్టులున్నాయి. వీటిలో కొన్ని పోస్టులకు ఫిబ్రవరి 26, మరికొన్ని పోస్టులకు మార్చి 7 దరఖాస్తులకు చివరితేది.
వయస్సు: ఫిబ్రవరి నాటికి 18 నుండి 24 వయసు వారై ఉండాలి. ఎస్‌సి/ఎస్‌టి/ఓబిసి వారికి వయోసడలింఫు వర్తిస్తుంది.
ఎంపికైన వారికి 12 నెలల పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ ఉంటుంది.
వ్రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు ఉంటాయి.