భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్‌ నేవీ దేశంలోని వివిధ నేవల్‌ కమాండ్‌లలో 1159 ట్రేడ్స్‌మ్యాన్‌మేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఇందులో 710 పోస్టులు విశాఖపట్నంలో కేటాయించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://www.joinindiannavy.gov.in/లో చూడవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఫిబ్రవరి 22 నుండి  ప్రారంభమవుతుంది. ధరఖాస్తు చేసుకోవడానికి  చివరి తేదీ మార్చి 7. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఐ‌ఎన్‌సి‌ఈ‌టి ) ద్వారా ఈ పోస్టులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఆయా కమాండ్ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.


హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్- విశాఖపట్నం: 710

హెడ్‌క్వార్టర్స్ వెస్టర్న్ నేవల్ కమాండ్- ముంబై: 324

హెడ్‌క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్- కొచ్చి: 125

అర్హత: 10వ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.

also read 10వ తరగతి అర్హత ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ధరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ల్ చేయండి.. ...

వయసు: 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు: నెలకు రూ.18000 నుంచి రూ.56900 వరకు చెల్లిస్తారు.

పరీక్ష ఫీజు: రూ.205/-

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 22 ఫిబ్రవరి 2021.

దరఖాస్తుకు చివరి తేది: 07 మార్చి 2021.

అధికారిక వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/