ఆర్మీ ఎగ్జామ్ పేపర్​ లీక్​.. దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు, పుణేలో కుట్ర

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకవ్వడం కలకలం రేపింది. ఈ వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన నియామక పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆర్మీ ప్రకటించింది. 

indian army cancels recruitment exam after paper leake ksp

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకవ్వడం కలకలం రేపింది. ఈ వార్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన నియామక పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆర్మీ ప్రకటించింది. పేపర్ లీకేజీకి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పుణెలో అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ వెల్లడించింది.

రిక్రూట్‌మెంట్‌ విషయంలో ఎలాంటి అక్రమాలకూ తావు ఉండకూడదనే ఉద్దేశంతోనే పరీక్ష రద్దు చేసినట్లు సైనికాధికారులు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో భాగంగా నియామక ప్రక్రియలో అవినీతి, అక్రమ పద్ధతులను భారత సైన్యం సహించదని స్పష్టం చేశారు.

ఆర్మీ సోల్జర్స్‌ (జనరల్‌ డ్యూటీ) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ కోసం రూపొందించిన పేపర్‌ శనివారం రాత్రి లీకయినట్లుగా గుర్తించామని వారు చెప్పారు. స్థానిక పోలీసులతో కలిసి పుణేలోని బారామతిలో నిందితులను గుర్తించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని సైన్యం తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios