ప్రభుత్వ ఉద్యోగం చేయాలని కోరుకునే  నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌(గ్రామీణ డాక్ సేవక్) రిక్రూట్‌మెంట్‌ 2021లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ సర్కిల్‌ కింద 1137 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

10వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు https://www.indiapost.gov.in/ అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఏప్రిల్ 7 దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది.

ఇండియా పోస్ట్‌ జీడీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ 2021 వివరాలు 
మొత్తం పోస్టుల సంఖ్య: 1137
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన గణితం, స్థానిక భాష, ఇంగ్లీష్ సబ్జెక్టులతో కూడిన 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

also read బిటెక్ చేసిన వారికి హైదరాబాద్ బి‌డి‌ఎల్ లో భారీగా ఉద్యోగాలు.. ధరఖాస్తు చేసుకొండో వెంటనే.. ...

వయసు:  18-40 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100/-
దరఖాస్తులు ప్రారంభ తేదీ : 8 మార్చి  2021
దరఖాస్తులకు చివరి తేది: 7 ఏప్రిల్  2021
ఎంపికలు : పదో తరగతి మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి


జీతం
బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ : 12వేల నుంచి 
ఆసిస్టంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్/ డాక్ సేవక్ : 10వేల నుంచి

వయసు సడలింపు 
ఎస్‌సి : 5 ఏళ్ళు 
ఓ‌సి : 3 ఏళ్ళు 
పి‌డబల్యూ‌డి : పదేళ్ళు 
మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌:https://www.indiapost.gov.in/ చూడండి..