Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. టెన్త్‌, ఇంటర్‌ అర్హత ఉన్నవారు వెంటనే అప్లయి చేసుకోండీ..

 ఈ నోటిఫికేషన్‌ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, స్టోర్ కీపర్, కార్పెంటర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 

iaf group c recruitment 2021 released indian air force invites applications for 255 vacancies details at indianairforce nic in
Author
Hyderabad, First Published Feb 15, 2021, 6:00 PM IST

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐ‌ఏ‌ఎఫ్) గ్రూప్‌-సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌజ్ కీపింగ్ స్టాఫ్, స్టోర్ కీపర్, కార్పెంటర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మార్చి 13 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం  https://indianairforce.nic.in/ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. మొత్తం  ఖాళీల సంఖ్య 255.

అర్హతలు: ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  వేతనంగా లెవెల్ -1 పోస్టులకు రూ.18,000, లెవెల్- 2 పోస్టులకు రూ.19,900, లెవెల్-4 పోస్టులకు రూ.25,500 ఇస్తారు.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత  అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ నింపి, డాక్యుమెంట్స్ జతచేసి నోటిఫికేషన్‌లో తెలిపిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి.

also read టెన్త్‌, ఇంటర్‌ అర్హతతో ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. ధరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి ...

దరఖాస్తులు ప్రారంభం: 11 ఫిబ్రవరి 2021

దరఖాస్తుకు చివరి తేదీ: 13 మార్చి 2021

పరీక్ష తేదీ: ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు.

వయస్సు: 18 నుంచి 25 ఏళ్లు

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

అధికారిక వెబ్‌సైట్:https://indianairforce.nic.in/

Follow Us:
Download App:
  • android
  • ios