హెచ్‌పీసీఎల్‌‌లో భారీగా ఉద్యోగాలు.. బీఈ/బీటెక్‌ చేసిన వారు ధరఖాస్తు చేసుకోవచ్చు..

హెచ్‌పి‌సి‌ఎల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనాలు అందించునున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

hpcl recruitment 2021 released application process begins for 200 engineer vacancies at jobs hpcl co in

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పి‌సి‌ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనాలు అందించునున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఇంజనీరింగ్ సంబంధింత విభాగంలో (బీటెక్‌/బీఈ) పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఏప్రిల్‌ 15 దరఖాస్తు చేసుకోవడానికి  చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్  https://www.hindustanpetroleum.com/లో చూడవచ్చు.

క్యాటగిరి కేటాయింపు: ఎస్‌సి -20, ఎస్‌టి -18, ఓ‌బి‌సి-49, ఈ‌డబల్యూ‌ఎస్-20, యూ‌ఆర్-93

ఇందులో ఉన్న మొత్తం ఖాళీలు: 200
మెకానికల్‌ ఇంజినీర్‌ - 120
సివిల్‌ ఇంజినీర్‌ - 30
ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ - 25
ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్‌ - 25

also read టెన్త్‌, ఐటీఐ అర్హత కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష ద్వారా ఎంపిక.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ.. ...

విద్యార్హత: గుర్తింపు పొందిన కాలేజీ/యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో నాలుగేళ్ల పాటు ఫుల్‌టైం ఇంజినీరింగ్‌ (బీఈ/బీటెక్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు.
ఎంపికలు: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్‌ టాస్క్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1180 (రిజర్వేషన్ల వారీగా ఫీజు మినహాయింపు ఉంటుంది)
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 3 మార్చి  2021
దరఖాస్తు  చివరితేది: 15 ఏప్రిల్‌ 2021
అధికారిక వెబ్‌సైట్‌:https://www.hindustanpetroleum.com/

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios