అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్  ఫలితాల విడుదల పై ఉన్న స్టేను హై కోర్టు ఎత్తివేసింది. ఈ ఫలితాలపై ఇంతకు ముందు స్టే విధించిన  విషయం విధితమే. అయితే దీని పై  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్  స్టేను ఎత్తివేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 పరీక్ష సమయంలో  కొన్ని  ప్రశ్నలపై అనువాదంలో తప్పులు ఉన్నాయని కొందరు అభ్యర్థులు హై కోర్టును ఆశ్రయించారు. హై కోర్ట్ అభ్యర్ధులు చేసిన పిటిషన్ పై కొంతకాలం స్టేను విధించింది. పిటిషన్ వేసిన ఆధారంగా దీని పై విచారణ జరిపిన న్యాయస్థానం  గతంలో ఇచ్చిన స్టేను హై కోర్టు ఎత్తివేసింది.

హై కోర్టు  స్టేను ఎత్తివేసిన తరువాత  ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేయలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 167  పోస్టులకు గాను ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్ కి ఎంపిక చేశారు. డిసెంబర్ 12 నుంచి 23 వరకూ గ్రూప్ వన్ మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించనున్నారు.