Asianet News TeluguAsianet News Telugu

Central Govt Jobs: ఇంటర్ అర్హతతో నెలకు రూ.69,000 వేతనంతో ఉద్యోగం, నేవీలో 2500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Indian Navy Recruitment 2022: కేవలం ఇంటర్ లో MPC చేస్తే చాలు నెలకు 69,000 వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సిద్ధంగా ఉంది. భారత నావికా దళానికి చెందిన నేవీ సెయిలర్ పోస్టుల కోసం అర్హత ఆసక్తికలిగిన అభ్యర్థులు దరఖాస్తు చివరి తేదీ - 5 ఏప్రిల్ 2022లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.  
 

Indian Navy Recruitment 2022 invited application for posts of Sailors check details
Author
Hyderabad, First Published Mar 19, 2022, 1:51 PM IST

Indian Navy Recruitment 2022:  కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేయడం అనేది ప్రతీ ఒక్కరి కల, ఇందుకోసం చాలా మంది సంవత్సరాల తరబడి కఠోరపరిశ్రమ చేస్తుంటారు. అయితే తాజాగా ఇంటర్మీడియట్ అర్హతతో భారత నావికా దళంలో ఏకంగా 2500 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. మీరు కేవలం ఇంటర్ ఎంపీసీ గ్రూపులో పాస్ అయితే చాలు ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే వీలు కలుగుతుంది.  

పీజీ, పీహెచ్డీ చేసిన వాళ్లు సైతం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం కేవలం ఇంటర్మీడియ్ ఉత్తీర్ణతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇండియన్ నేవీ AA (ఆర్టిఫైసర్ అప్రెంటిస్) మరియు SSR (సీనియర్ సెకండరీ రిక్రూట్) కింద సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 29, 2022 నుండి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ద్వారా 5 ఏప్రిల్ 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 2500 సెయిలర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.

ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2022: (Indian Navy Recruitment 2022 ) విద్యార్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌తో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత విద్యార్హత మరియు ఇతర సమాచారం కోసం, అభ్యర్థులు విడుదల చేసిన అధికారిక రిక్రూట్‌మెంట్ ప్రకటనను తనిఖీ చేయవచ్చు.

ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2022: (Indian Navy Recruitment 2022 ) వయో పరిమితి
దరఖాస్తుదారు వయస్సు 17 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2022: (Indian Navy Recruitment 2022 ) ఎంపిక ప్రక్రియ
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.

ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2022: (Indian Navy Recruitment 2022 ) ఈ తేదీలను గుర్తుంచుకోండి
దరఖాస్తు ప్రారంభ తేదీ - 29 మార్చి 2022
దరఖాస్తు చివరి తేదీ - 5 ఏప్రిల్ 2022

ఎంపిక ప్రక్రియ ఇదే... (Indian Navy Recruitment 2022 )
ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌, మెడికల్ ఎగ్జామినేషన్ రూపంలో జరుగుతుంది. 
>> ఆర్టిఫిషర్ అప్రెంటీస్ కు దేశ‌‌వ్యాప్తంగా నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఆన్‌‌లైన్ టెస్టులో మెరిట్ ఆధారంగా ఎంపిక  చేస్తారు. 
>>  SSR (సీనియర్ సెకండరీ రిక్రూట్)  పోస్టుల కోసం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
>> ఈ రెండు పోస్టులకు ఆన్‌‌లైన్ టెస్టులో అర్హత సాధించిన వారిని మాత్రమే ఫిజికల్ టెస్టులకు ఎంపిక చేస్తారు. 
>> ఫిజికల్ టెస్టులో క్వాలిఫై అయిన వారికి మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. 

పరీక్ష విధానం:  (Indian Navy Recruitment 2022)
ఆన్‌‌లైన్‌‌ పరీక్షలో 100 మార్కులకు 100 ప్రశ్నలను. 60 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. సిలబస్ ఇంటర్మీడియట్  స్థాయిలో ఉంటుంది. పరీక్షను ఇంగ్లిష్, హిందీ మీడియంలో నిర్వహిస్తారు. ఒక తప్పు సమాధానానికి పావు మార్కు మైనస్ అవుతుంది. మరిన్ని వివరాలకు పూర్తి నోటిఫికేషన్ చదవండి.. 

ఫిజికల్, మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్:  (Indian Navy Recruitment 2022 )
ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌ కోసం 7 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరుగు, దాంతో పాటు 20 సిట్‌‌అప్స్, 10 పుష్‌ అప్స్‌ తీయాల్సి ఉంటుంది. క్రీడల్లో రాణించిన సర్టిఫికెట్స్ ఉన్న వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఎత్తు విషయానికి వస్తే  కనీసం 157 సెం.మీ. ఉండాలి. చాతీ (గాలి పీల్చినప్పుడు) 5 సెం.మీ. విస్తరించాలి. కంటిచూపు 6/6 గా ఉండాలి.

ట్రైనింగ్, స్టైఫండ్ వివరాలు:  (Indian Navy Recruitment 2022 )
ఈ పరీక్షల్లో ఎంపికైన వారికి ఆగస్టు 2022లో  ఏఆర్ (ఆర్టిఫిషర్ అప్రెంటీస్)  అభ్యర్థులకు 9 నెలలు, ఎస్ఎస్ఆర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్) అభ్యర్థులకు 22 నెలల పాటు ఐఎన్ఎస్ చిల్కా కేంద్రంలో ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్‌‌లో నెలకు రూ. 14,600 స్టైపెండ్ అందచేస్తారు. ఈ టైంలో నెలకు రూ.21,700 నుంచి రూ. 69,100 వరకూ వేతనం స్కేలు అమల్లో ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios