హైదరాబాద్: సిద్దిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్  పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీగా ఉన్న 29 పోస్టుల కోసం నియమకాలు చేపట్టనున్నారు.

ఈ నియామకాలు ఒక సంవత్సర కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ డాక్టర్ రూ.36,200 వేతనం, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ నెలవారీ జీతం రూ.70,000తో  ఇవ్వనున్నారు.

జనరల్ మెడిసిన్ లో నాలుగు, టిబిసి‌డిలో ఒకటి, జనరల్ సర్జరీలో నాలుగు, అనస్థీషియా- ప్రసూతి- గైనకాలజీలో రెండు పోస్టులు ఉన్నాయి. ఇంటర్వ్యూ రోజున అభ్యర్థి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని దరఖాస్తును సమర్పించాలి.

అర్హ‌త‌: జూనియ‌ర్ రెసిడెంట్ డాక్టర్ పోస్టుకు ఎంబీబీఎస్ పూర్తిచేసి ఉండాలి. సీనియ‌ర్ రెసిడెంట్ డాక్టర్ పోస్టుకు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ లేదా ఎమ్మెస్ చేసి ఉండాలి. అభ్యర్ధులు 40 ఏండ్ల లోపువారై ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా 

ఇంటర్వ్యూ తేదీ: అక్టోబ‌ర్ 14

వెబ్‌సైట్‌: http://www.gmcsiddipet.org/

also read అంగన్‌వాడీల్లో 5,905 ఉద్యోగాలు.. 10వ తరగతి అర్హత ఉంటే చాలు.. ...

కొండపూర్ లోని జిల్లా ఆసుపత్రిలో గైనకాలజిస్టులు

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఒక సంవత్సరం కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన గైనకాలజీ స్పెషాలిటీలో పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా అర్హత కలిగిన వైద్యుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. రంగారెడ్డి జిల్లా కొండపూర్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో  పనిచేయాల్సి ఉంటుంది, నెలవారీ వేతనం రూ .1 లక్ష.

ఆసక్తి కలిగిన వారు తమ బయోడేటా, సర్టిఫికెట్స్  అక్టోబర్ 13 ఉదయం 11.30 లోగా ఈ క్రింది అడ్రసుకు సంప్రదించి అందించాల్సి ఉంటుంది. 

చిరునామా 
సూపరింటెండెంట్ ఆఫీసు, 
 కొండపూర్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రి, 
రంగారెడ్డి జిల్లా -500084 

ఎంపికైన అభ్యర్ధులకు ఇమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని రంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.