Govt Job Aspirants: ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించేవారికి శుభవార్త.. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌లో ఉద్యోగాలు..!

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC).. వివిధ పోస్టుల‌ భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. త్వ‌ర‌లోనే మ‌రో 42 వేల ఉద్యోగాలను భ‌ర్తీ చేయ‌నుంది. ఆ వివ‌రాలేంటో చూద్దాం..!

Good news for govt job aspirants

 ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే వారికి శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 15, 247 పోస్టులకు నోటిఫికేష‌న్‌ జారీ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయనుంది. ఈ నోటిఫికేష‌న్‌ల‌ను మరో రెండు నెలల్లో వివిధ శాఖలు జారీ చేయనున్నాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) నుండి ఒక ట్వీట్ ఈ విష‌యాన్ని ధృవీకరించింది. PIB తెలిపిన వివ‌రాల‌ ప్ర‌కారం.. "డిసెంబర్ 2022లోపు 42,000 ఉద్యోగాలను పూర్తి చేయాలని, SSC రాబోయే పరీక్షల కోసం 67,768 ఖాళీలను తక్షణమే భర్తీ చేయడానికి ప్రణాళికలను రూపొందించింది.

'అగ్నిపథ్' పథకంపై నిరసనల వ‌ల‌న‌ SSC 15,247 పోస్టులకు నియామక నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రాసెస్ చేస్తుంది", ఇది రాబోయే నెలల్లో వివిధ శాఖలచే జారీ చేయబడుతుంది. ఈ ఏడాది ముగిసేలోపు ఈ ఖాళీలన్నీ భర్తీ చేయడానికి షెడ్యూల్ చేసిన‌ట్లు స‌మాచారం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ ఆశావహుల మనోధైర్యాన్ని పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ భ‌ర్తీపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios