Asianet News TeluguAsianet News Telugu

డి‌ఎస్‌ఎస్‌ఎస్‌బిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. .. కొద్దిరోజులే అవకాశం వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

డి‌ఎస్‌ఎస్‌ఎస్‌బి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను ఢిల్లీ జల్ బోర్డ్, ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో భర్తీ చేయనుంది.
 

dsssb job recruitment 2021 notification released apply online for 1809 posts before april 14
Author
Hyderabad, First Published Apr 12, 2021, 7:17 PM IST

 ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (డి‌ఎస్‌ఎస్‌ఎస్‌బి) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో ఢిల్లీ జల్ బోర్డ్, ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో ఈ మొత్తం ఖాళీ పోస్టులున్నాయి.

వీటిలో జూనియర్ స్టెనోగ్రాఫర్, ల్యాబ్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ కెమిస్ట్, జూనియర్ ఇంజనీర్, పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు ఏప్రిల్ 14 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://dsssb.delhi.gov.in/ లేదా https://dsssbonline.nic.in/ అధికారిక వెబ్‌సైట్లలో చూడవచ్చు.

మొత్తం ఖాళీలు- 1809
టెక్నికల్ అసిస్టెంట్- 32, ల్యాబరేటరీ అటెండెంట్- 66, అసిస్టెంట్ కెమిస్ట్- 40, అసిస్టెంట్ ఇంజనీర్ ఈ అండ్ ఎం- 14, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ లేదా మెకానికల్)- 62, డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్ 1- 16, పర్సనల్ అసిస్టెంట్- 84, ఫార్మసిస్ట్- 82, అసిస్టెంట్ డైరెక్టర్- 3, అసిస్టెంట్ గ్రేడ్ 2- 28, జూనియర్ స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)- 13, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్- 31, సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ- 6, సెక్యూరిటీ సూపర్‌వైజర్- 9, అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్- 158, కార్పెంటర్ 2 క్లాస్- 4, అసిస్టెంట్ ఫిల్టర్ సూపర్‌వైజర్- 11, ప్రోగ్రామర్- 5, టీజీటీ (చెవిటి & మూగ)- 19, స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ- 1126

also read బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్.. ...


విద్యార్హతలు: పోస్టులను బట్టి వివిధ విద్యా అర్హతలను నిర్ణయించారు.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 14 ఏప్రిల్ 2021

వయస్సు: అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అధికారిక వెబ్‌సైట్‌:https://dsssb.delhi.gov.in/

Follow Us:
Download App:
  • android
  • ios