భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గనేజేష‌న్(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని సెంట‌ర్ ఫ‌ర్ ప‌ర్సన‌ల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) వివిధ విభాగాల్లో మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులను కోరుతోంది. పదోతరగతి లేదా ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  

మల్టీటాస్కింగ్ పోస్టుల వివరాలు.

మొత్తం ఖాళీల సంఖ్య: 1817

also read Metro Rail Jobs: మెట్రో రైల్‌లో ఉద్యోగ అవకాశాలు...మొత్తం ఖాళీలు ఇవే

జనరల్-849, ఓబీసీ-503, ఈడబ్ల్యూఎస్-188, ఎస్సీ-163, ఎస్టీ-11

అర్హత: మల్టీటాస్కింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ప‌దోత‌ర‌గ‌తి లేదా ఐటీఐ అర్హత కలిగి ఉండాలి.

వయసు:అభ్యర్థుల వయసు 23.01.2020 నాటికి 18 - 25 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం: టైర్‌-1(స్క్రీనింగ్), టైర్‌-2 (ఫైనల్) ఆన్‌లైన్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

టైర్‌-1 పరీక్ష 

మొత్తం 100 మార్కులకు స్టేజ్-1 పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజినింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు- 35 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 30 ప్రశ్నలు- 30 మార్కులు, క్యూఏ & న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు- 35 మార్కులు ఉంటాయి.

టైర్‌-2 పరీక్ష

also read బీఈసీఐఎల్‌లో పారామెడికల్ ఉద్యోగాలు....మొత్తం పోస్టుల ఖలీలు 98

మొత్తం  100 ప్రశ్నలు 100 మార్కుల స్టేజ్-2 పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో జనరల్ సైన్స్ నుంచి 40 ప్రశ్నలు- 40 మార్కులు, జనరల్ మ్యాథ్స్ నుంచి 40 ప్రశ్నలు- 40 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నలు- 20 మార్కులు ఉంటాయి.

టైర్‌-1, టైర్‌-2 పరీక్ష సమయం 90 నిమిషాలు.


జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18 వేల నుంచి రూ.56 వేల వరకు జీతం ఉంటుంది. జీతంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తున్నారు. వైద్య సదుపాయాలు, ప్రయాణం, మిలిటరీ క్యాంటీన్ సౌకర్యాలు అనేక సౌకర్యాలలో అందించబడతాయి. అన్ని భత్యాలతో కలిపి ప్రారంభంలో నెలకు రూ.20,000 వరకు జీతం ఉంటుంది.


దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది : 23.12.2019.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రి తేది: 23.01.2020.

టైర్-1 పరీక్ష తేదిని వెల్లడించాల్సి ఉంది.