రాత పరీక్ష లేకుండా ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. టెన్త్ పాసైన వారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వేలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీచేయనుంది. అర్హత, ఆసక్తిగల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
భారతీయ రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వేలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీచేయనుంది.
అర్హత, ఆసక్తిగల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 5 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
ఇందులో ఎంపికైన అభ్యర్థులు సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై, పుణె, నాగ్‌పూర్, భుసావల్, షోలాపూర్ డివిజన్‌లలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఉన్న ఖాళీలు: 2532
క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో, వ్యాగన్ వాడి బందర్-469, ముంబై కల్యాన్ డీజిల్ షెడ్-53, కుర్లా డీజిల్ షెడ్-60, సీనియర్ డీ (టీఆర్‌ఎస్) కుర్లా, కల్యాణ్-371, పారెల్ వర్క్‌షాప్-418, మాతుంగా వర్క్‌షాప్-547, ఎస్ అండ్ టీ వర్క్‌షాప్, బైకుల్లా-60, ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్-80, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్-118, మన్మాడ్ వర్క్‌షాప్-51, టీఎండబ్ల్యూ నాసిక్‌రోడ్-49, డీజిల్ లోకోషెడ్ (పుణె)-49, ఎలక్ట్రిక్ లోకో షెడ్ (నాగ్‌పూర్)-48, అజ్ని క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో-66, కుర్దువాడి వర్క్‌షాప్ (షోలాపూర్)-21 చొప్పున పోస్టులు ఉన్నాయి.
also read ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో భారీగా ఉద్యోగాలు.. వెంటనే అప్లయి చేసుకోండీ.. ...
అర్హత: పదో తరగతి లేదా సమానమైన ఏదైనా కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్‌టీవీసీ సర్టిఫికెట్ కూడా ఉండాలి.
వయసు: 15 నుంచి 24 ఏళ్ల లోపు మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: టెన్త్, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: 6 ఫిబ్రవరి 2021
దరఖాస్తుకు చివరితేదీ: 5 మార్చి 2021
అధికారిక వెబ్‌సైట్:https://www.rrccr.com/