సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ టర్మ్ 2వ తరగతి తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లలో ప్రకటించనుంది. ఫలితాల విడుదల తేదీ, సమయం అప్ డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ చూడండి.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి టర్మ్ 2 బోర్డు పరీక్ష ఫలితాలతో పాటు ఫైనల్ రిజల్ట్స్ త్వరలో ప్రకటించనుంది. తాజాగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ సీబీఎస్‌ఈ బోర్డు ఫలితాలను సకాలంలో ప్రకటిస్తామని, ఫలితాల విడుదలలో జాప్యం ఉండదని చెప్పారు. అలాగే జూలై చివరి వారంలో ఫలితాలను విడుదల చేస్తామని సీబీఎస్‌ఈ అధికారి ఒకరు తెలిపారు. బోర్డు పరీక్షలో పాల్గొన్న విద్యార్థులు 10వ తరగతి, 12వ టర్మ్ 2 ఫలితాల విడుదల తేదీ, సమయానికి సంబంధించి అఫిషియల్ అనోంస్మెంట్ కోసం వేచి ఉండాలి.

డిజిలాకర్‌ చెక్ చేయడానికి సెక్యూరిటీ పిన్‌
ఈసారి డిజిలాకర్ నుండి సిబిఎస్‌ఇ మార్క్‌షీట్‌లు, సర్టిఫికెట్లు మొదలైనవాటిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి విద్యార్థుల డిజిలాకర్ అక్కౌంట్ కి సెక్యూరిటీ పిన్ ఇవ్వనుంది. విద్యార్థులు వారి పిన్ నంబర్ కోసం స్కూల్ సంప్రదించాలి.

 మీరు మొబైల్ యాప్ ద్వారా ఫలితాలను చెక్ చేయవచ్చు
CBSE టర్మ్ 2 ఫలితాలను డౌన్‌లోడ్ చేయడానికి మొబైల్ యాప్

1. డిజిలాకర్ యాప్

2. ఉమంగ్ యాప్

విద్యార్థులకు కంబైన్డ్ మార్క్‌షీట్ 
CBSE 10వ, 12వ తరగతుల టర్మ్ 2 పరీక్షలను 26 ఏప్రిల్ నుండి 24 మే 2022 వరకు నిర్వహించింది. CBSE 12వ టర్మ్ 1 అండ్ టర్మ్ 2 ఫలితాల కోసం విద్యార్థులు సింగిల్ కంబైన్డ్ మార్క్ షీట్‌ను పొందుతారని గమనించాలి.

టర్మ్-2 స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా
మొదట సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ cbseresults.nic.in అండ్ results.gov.in అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి.

హోమ్‌పేజీలో, "CBSE టర్మ్ 2 క్లాస్ 12 ఫలితం లేదా CBSE టర్మ్ 2 క్లాస్ 10 ఫలితం 2022" అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.

మీ రోల్ నంబర్ వంటి లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి.

మీ CBSE టర్మ్ 2 ఫలితాలు స్క్రీన్‌పై చూపిస్తుంది

స్క్రీన్‌పై ఉన్న CBSE టర్మ్ 2 స్కోర్‌కార్డ్ అండ్ మార్క్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేయండి.

భవిష్యత్తు సూచన కోసం దాని ప్రింటవుట్ తీసుకోండి.