హెడ్ కానిస్టేబుల్ జాబ్ రిక్రూట్‌మెంట్: వెయ్యికి పైగా పోస్టులు.. కొద్దిరోజులే ఛాన్స్..

అభ్యర్థులు 19 సెప్టెంబర్ 2022 లోగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్  rectt.bsf.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు  సబ్మిట్ చేశాక తాత్కాలికంగా ఆమోదించబడుతుంది. 

BSF Head Constable Recruitment 2022 out: Register For 1312 Posts at official site

 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బి‌ఎస్‌ఎఫ్) హెడ్ కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు బి‌ఎస్‌ఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌ rectt.bsf.gov.inలో లాగిన్ ద్వారా పోస్ట్‌ల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1312 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఫారమ్‌ చివరి తేదీ 19 సెప్టెంబర్ 2022. 

బి‌ఎస్‌ఎఫ్ రిక్రూట్‌మెంట్ 2022: ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 ఆగస్టు 2022
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 19 సెప్టెంబర్ 2022

బి‌ఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఖాళీల వివరాలు
పోస్ట్ పేరు అండ్ ఖాళీలు  
హెడ్ ​​కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్):  982 పోస్టులు
హెడ్ ​​కానిస్టేబుల్ (రేడియో మెకానిక్):  330 పోస్టులు

బి‌ఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అర్హత ప్రమాణాలు
హెడ్ ​​కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన రేడియో ఆండ్ టెలివిజన్‌లో రెండేళ్ల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ITI) సర్టిఫికేట్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా డేటా ప్రిపరేషన్ & కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ లేదా జనరల్ ఎలక్ట్రానిక్స్ పొంది ఉండాలి. పి‌సి‌ఎం సబ్జెక్టులలో మొత్తం 60% మార్కులతో రెగ్యులర్ విద్యార్థిగా గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూషన్ నుండి ఇంటర్మీడియట్   ఉత్తీర్ణత పొంది ఉండాలి.

హెడ్ ​​కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన రేడియో అండ్ టెలివిజన్‌లో రెండేళ్ల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ITI) సర్టిఫికేట్ లేదా జనరల్ ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా డేటా ప్రిపరేషన్ & కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ లేదా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లేదా ఇన్ఫో టెక్నాలజీ & ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ నిర్వహణ లేదా కంప్యూటర్ హార్డ్‌వేర్ లేదా నెట్‌వర్క్ టెక్నీషియన్ లేదా మెకాట్రానిక్స్ లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ సర్టిఫికేట్ ఉండాలి. పి‌సి‌ఎం సబ్జెక్టులలో మొత్తం 60% మార్కులతో రెగ్యులర్ విద్యార్థిగా గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూషన్ నుండి ఇంటర్మీడియట్ లేదా సమానమైన ఉత్తీర్ణత పొంది ఉండాలి. 

బి‌ఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సెలెక్షన్ విధానం
పైన పేర్కొన్న పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోనే అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా విద్యార్హత, వయోపరిమితి ఇంకా సెలెక్షన్ ప్రక్రియను చెక్ చేయవచ్చు. 

బి‌ఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ జీతం 
హెడ్ ​​కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్):  పే మ్యాట్రిక్స్‌లో లెవల్-4 (రూ. 25, 500 నుండి 81,100 (7వ CPC ప్రకారం))
హెడ్ ​​కానిస్టేబుల్ (రేడియో మెకానిక్):  పే మ్యాట్రిక్స్‌లో లెవల్-4 (రూ. 25, 500 నుండి 81,100 (7వ CPC ప్రకారం))

బి‌ఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అభ్యర్థులు 19 సెప్టెంబర్ 2022 లోగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్  rectt.bsf.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు  సబ్మిట్ చేశాక తాత్కాలికంగా ఆమోదించబడుతుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్  ప్రింట్ అవుట్ బి‌ఎస్‌ఎఫ్ రిక్రూట్‌మెంట్ సెంటర్‌లకు సమర్పించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) అండ్ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ కోసం ఆక్టివ్ ఇ-మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్‌ను ఉపయోగించాలని సూచించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios