డిగ్రీ బీకాం పూర్తిచేసిన అభ్యర్థుల కోసం బి‌హెచ్‌ఈ‌ఎల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 5 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 26 వరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. 

డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగులకు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందేందుకు సువర్ణవకాశం. భారత ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఇందులో ఫైనాన్స్‌ విభాగంలో ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి ధరఖాస్తులను స్వీకరిస్తున్నది. అర్హత, ఆసక్తిగల డిగ్రీలో బీకాం పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 5 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 26 వరకు దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://www.bhel.com/ చూడవచ్చు

మొత్తం ఖాళీ పోస్టులు: 40

జనరల్-‌ 25, ఈడబ్ల్యూఎస్-‌ 2, ఓబీసీ- 10, ఎస్‌సి- 2, ఎస్‌టి- 1

మొత్తం పోస్టులలో పి‌డబల్యూ‌డి అభ్యర్ధులకు 4%, ఎక్స్ సర్వీస్ మెన్ కి 14.5% కేటాయించబడుతుంది.

అర్హత: డిగ్రీలో బీకాం చదివి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక చేసిన అభ్యర్థులను రాతపరీక్షకు ఆహ్వానిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 5 ఏప్రిల్‌ 2021

దరఖాస్తులకు చివరితేదీ: 26 ఏప్రిల్‌ 2021

రాతపరీక్ష: 23 మే 2021

అధికారిక వెబ్‌సైట్‌:https://www.bhel.com/